సాధారణంగా చోరీ చేసేందుకు దొంగలు పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అలా వారు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇళ్లు, వ్యాపార సంస్థలు, దుకాణాల్లో చోరీ చేసి అందినకాడికి దొచుకుని అక్కడి నుంచి ఉడాయిస్తారు. అయితే చోరికి వెళ్లిన ఓ దొంగ మాత్రం అనుకోకుండా అడ్డంగా దొరికిపోయాడు. ఇంట్లో ఉన్న బంగారం అంతా సర్థేశాడు. అయితే అతడు చేసిన ఓ చిన్న పొరపాటు ఆ ఇంట్లో ఇర్కుపోయేలా చేసింది. చివరకు ఊహించని విధంగా ఇంటి యజమానికి దొంగ బుక్కయ్యాడు. తమ జాతికే ఈ దొంగ తలవంపులు తెచ్చాడని దొంగలు ఫీలవుతున్నారు. మరి.. ఇంతకి ఆ దొంగ చేసిన ఘనకార్యం ఏమిటి? ఇంటి యజమానికి ఎలా దొరికిపోయాడు? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారంకు చెందిన హన్మంతప్ప ఇంట్లో చోరి చేసేందుకు.. అదే గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ప్లాన్ వేసుకున్నాడు. ఈక్రమంలోనే శనివారం రాత్రి హన్మంతప్ప కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్న తరువాత శంకర్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి దూరిన దొంగ.. అక్కడ దొరికిన బంగారం అంతా తీసుకుని సర్దేసుకున్నాడు. ఇక వచ్చిన పని పూర్తైందని ఎంతో సంతోషపడ్డాడు. ఈక్రమంలో బయటకి వెళ్లే సమయంలో ఇంట్లో ఓ వైపు పత్తి కనిపించింది. శంకర్ కాస్తా విశ్రాంతి తీసుకోవడానికి దానిపై పడుకున్నాడు. మద్యం మత్తులో ఉండటంతో అతడు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. హన్మంతప్ప కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం నిద్రలేచి.. ఇంటికి తాళం వేసి తమ పనులకు వెళ్లిపోయారు. వారు వెళ్లిన కాసేపటికి శంకర్ కి మెలుకువ వచ్చింది.
అయితే వారు బయట తాళం వేసి వెళ్లడంతో రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు. చివరకు సాయంత్రం హన్మంతప్ప కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి తలుపు తీయగా శంకర్ కనిపించడంతో షాకయ్యారు. స్థానికుల సాయంతో ఆ దొంగను బంధించిన హన్మంతప్ప కుటుంబ సభ్యులు.. అతడిని ఓ గుంజకు కట్టేశారు. అతడు దొంగిలించిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు.. అక్కడికి చేరుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. శంకర్ పై గతంలోనే రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం అన్ని కుటుంబాలను నాశనం చేస్తే.. హన్మంతప్ప కుటుంబాన్ని కాపాడిందని స్థానికులు అంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.