అగ్ని సాక్షిగా.. ఏడడుగులు.. మూడు ముళ్లతో ఒక్కటి అవుతున్న దంపతులు తమ శారీరక సుఖాల కోసం వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాలంలో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలతో సంసారాల్ని నాశనం చేసుకున్న వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆధునిక కాలంలో భార్య భర్తల అన్యోన్య జీవితంలో ఎడబాటే ఎదురౌతోంది. అయితే ఎక్కవ శాతం భార్యలే భర్తలపై కేసు పెడతారు. కానీ ఇక్కడ ఓ భర్త తన భార్య మోసం చేసిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ కు 2013లో రుబీనా బేగంతో పెళ్లి జరిగింది. వారి వివాహం పెద్దల కుదిర్చిన వివాహమే. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. అయితే తాజాగా తన భార్య తనను మోసం చేసిందని సుల్తాన్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ఫిర్యాదు లో తన భార్య తనకు తెలియకుండా ముబీనుద్దీన్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుందని తెలిపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుబీనా బేగంకు పెళ్లి అయినప్పటికీ ఆమె 2017లో ముబీనుద్దీన్ అనే వ్యక్తిని మళ్లీ వివాహం చేకుంది. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇది వారి మహ్మదీయ చట్టం ఖులా (విడాకులు) కు వ్యతిరేకమని ఫిర్యాదులో సుల్తాన్ పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు. గతంలో రుబీనా బేగం తనపై తప్పుడు కేసులు పెట్టిందని, అలాగే తనపై తప్పుడు ఆరోపణలు సైతం చేసిందని మహమ్మద్ సుల్తాన్ ఆరోపించాడు.
అదీ కాక తాను అప్పట్లో లైంగిక సామర్థ్య పరీక్షను కూడా చేయించుకుని సర్టిఫికెట్ ని తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. రుబీనా కుటుంబ సభ్యులు గతంలో పలు మార్లు నాపైన దాడి చేశారని, వారి నుంచి నాకు ప్రాణహాని ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. దీంతో పోలీసులు వారి అందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరి ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.