ఈ మద్య పోలీసులు టెక్నాలజీ వినియోగించుకొని ఎన్నో కష్టతరమైన కేసులు కూడా ఈజీగా ఛేదిస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి కేసును ఒక్క గంటలోనే చేధించి తమ సత్తా చాటారు పోలీసులు. ఈరోజు ఉదయం నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. పాప కిడ్నాప్ కు గురైందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: కచ్చా బాదం లాగే.. ఇప్పుడు కచ్చా జామకాయ్ సాంగ్.. వీడియో వైరల్
రంగంలోకి దిగిన పోలీసులు నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్న 18 నెలల పాపను ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఫుటేజ్ లో ఉన్న మహిళను ఎక్కడికి వెళ్లిందన్న విషయం పై దృష్టి సారించారు. అనుమానితురాలు ఆస్పత్రి నుంచి ఆటోలో మెహదీపట్నం చేరుకున్నట్లు గుర్తించారు.
ఇది చదవండి: ముంబై డ్రగ్స్ కేసు: షారుక్ కుమారుడికి క్లీన్ చీట్
మెహదీపట్నం నుంచి అత్తాపూర్ సమీపంలోని కోమటికుంట టోడీ (కల్లు) కాంపౌండ్ కు చేరుకున్నట్లు గుర్తించారు. వెంటనే నాంపల్లి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారమివ్వగా.. అప్రమత్తమై పాపను కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి పాపను తీసుకుని, నిందితురాలిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒక్క గంటలోనే కేసును చేధించి పాపను తల్లివద్దకు చేర్చిన పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.