విడాకుల కేసులో సాధారణంగా భర్త నుంచి విడిపబోయిన మహిళకు భరణం లభిస్తుంది. అంతేకాకుండా భర్త సంపాదన లేదా ఆయన ఆస్తుల్లో కొంత భాగాన్ని చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తాయి. మహారాష్ట్రలోని పుణె ఫ్యామిలీ కోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. ఓ వృద్ధ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే.. సదరు భర్తకు భార్య నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ 83 ఏళ్ల వృద్ధుడు తన 78ఏళ్ల భార్య ఆయనను విపరీతంగా వేధిస్తోందని, విడాకులతో పాటు భరణం కూడా ఇప్పించాలని కోరుతూ 2019 కోర్టును ఆశ్రయించారు. తమ వివాహం జరిగి 55 ఏళ్లు అయిందని, ఇన్నేళ్లుగా కూడా తాను ఇబ్బంది పడుతూనే ఉన్నానని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు కొన్ని నెలల పాటు విచారణ జరిపింది. చివరకి అయన కోరినట్లే విడాకులు మంజూరు చేసింది పూణేలోని ఫ్యామిలీ కోర్టు. తప్పు ఎవరి వైపు ఉన్నా తప్పేనని.. సంపాదన, విడాకుల విషయంలో స్త్రీపురుష భేదం చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార్య ప్రతినెలా రూ.25 వేల చొప్పున భర్తకు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది.

అయితే కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే క్రమంలో పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ… ” హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం.. భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు విడాకులు మంజూరు చేయవచ్చు. అందులో భార్యకు ఆదాయం ఉండి భర్తకు ఎలాంటి ఆదాయ మార్గం లేనప్పుడు సదరు భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చు. భార్యలే కాదు బాధిత భర్తలు కూడా సమాన న్యాయాన్ని పొందవచ్చని ఈ కేసులో కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది..” అని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
“హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం.. భార్యా భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు విడాకులు మంజూరు చేయవచ్చు. అందులో భార్యకు ఆదాయం ఉండి భర్తకు ఎలాంటి ఆదాయ మార్గం లేనప్పుడు సదరు భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చు. భార్యలే కాదు బాధిత భర్తలు కూడా సమాన న్యాయాన్ని పొందవచ్చని ఈ కేసులో కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది..” అని పేర్కొన్నారు. మరి.. భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందే అని కోర్టు తీర్పు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సరిహద్దు దాటి భారత్లోకి పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న భారత సైనికులు!
