హైదరాబాద్ లో హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. దీని కోసం ఏర్పాటు అన్నీ పూర్తి అయ్యాయి. నేడు రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి.. ఈ క్రమంలో పదాధికారుల సమావేశం నేడు ప్రారంభం అయ్యింది. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి నటి, బీజేపీ నేత ఖుష్భు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి ఇక్కడ కొంత మంది వ్యతిరేకంగా చెస్తున్న ప్రచారం చూస్తుంటే విస్మయం కలుగుతుందని అని అన్నారు. ఎంత రాజకీయ విభేదాలు ఉన్నా కూడా భారత ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినపుడు ఇక్కడ ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవడం కనీస సంస్కారం అన్నారు. ప్రధాని ఇప్పటికీ మూడవసారి రావడం.. అయినా కూడా సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం చూస్తుంటే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.
హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా బ్యానర్లు, హూర్డింగ్స్ చూస్తుంటే.. ఇక్కడ బీజేపీని చూస్తే టీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నట్లే కనిపిస్తుంది. ఈసారి తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా వారసత్వ పాలన అస్సలు ఉండకూడదు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.