తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కుష్బూ తన తన చిరకాల కోరికను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉందని ఆమె అన్నారు. ఆమె మీడియాలో మాట్లాడుతూ..
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి కుష్భూ సుందర్. తెలుగు సినిమాతో సినిమా కెరీర్‌ను స్టార్ చేసిన ఈమె తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా బ్లాక్ బాస్టర్ సినిమాలు చేశారు. తమిళంలో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందారు. తమిళ ప్రజలు ఆమె అందం, అభినయానికి ఫిదా అయిపోయారు. ఏకంగా గుడి కట్టించారు. కుష్బూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘రామబాణం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా కుష్భూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేయాలన్న తన కోర్కెను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి గురించి కుష్బూ మాట్లాడుతూ.. ‘‘ ఆయన ఓ లెజెండ్. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మానవత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం, చేసే పని మీద ప్యాషన్ అద్భుతంగా ఉంటాయి. ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ‘నేను మెగాస్టార్ ఏది చేసినా చూస్తారు’ అని అనుకోరు.
ఇప్పటివరకు పూర్తికాని, నా కల ఏదైనా ఉంది అంటే.. అది చిరంజీవి గారితో రొమాన్స్ చేయలేకపోవటమే.. స్టాలిన్‌లో ఆయనతో కలిసి నటించాను. తర్వాత ఇద్దరం కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా.. మెచ్యూర్ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల’’ అని అన్నారు. మరి, మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేయాలన్న కుష్బూ కలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.