భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. అందుకు నిదర్శనం దేశంలో జరిగే అనేక మతసామరస్య వేడుకలు. ఒకే జాతి ఉన్న దేశాల్లో కూడా భారత దేశంలో ఉన్నట్లు ఉండదు. మతసామరస్యానికి ప్రతీకగా కొన్ని చోట్ల హిందూ ముస్లిం బాయి బాయి అంటూ పండుగలు జరుపుకోవడం, అన్యోన్యయంగా కలిసి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హిందు వివాహంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం క్రిష్ణాపురానికి చెందిన చిట్యాల వీరన్న-లక్ష్మీ దంపతుల పెద్ద కూతురు జాహ్నవి వివాహం దిలీప్ తో ఆదివారం జరిగింది. అయితే వీరన్న ఉన్న ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉండటంతో ఆయనకు చిన్ననాటి నుంచి వారితో మంచి స్నేహభావం ఉండేది. ఈ క్రమంలోనే కూతురి పెళ్లి సందర్భంగా పవిత్ర రంజాన్ మాసంలో కూడా కలవడంతో ఆదివారం రాత్రి 120 మంది ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందును వధూవరులే స్వయంగా వడ్డించారు.అనంతరం ముస్లింలు నూతన దంపతులను ఆశీర్వదించారు. హిందూ,ముస్లింల మతసామరస్యానికి ఈ విందు ప్రతీకగా నిలుస్తూ అక్కడ విశేషంగా మారింది. ఇలా నిత్యం అనేక చోట్ల మతసామరస్యాని చాటిచెప్పే వేడుకలు జరుగుతున్నాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.