SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Hyderabad Doctor Shares 6 Years Boy Cancer Story On Twitter Goes Viral

ఆరేళ్లకే క్యాన్సర్‌ బారిన పడ్డ బాలుడు.. డాక్టర్‌తో చెప్పిన మాటలు వింటే కన్నీళ్లాగవు!

  • Written By: Dharani
  • Updated On - Fri - 6 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆరేళ్లకే క్యాన్సర్‌ బారిన పడ్డ బాలుడు.. డాక్టర్‌తో చెప్పిన మాటలు వింటే కన్నీళ్లాగవు!

బిడ్డకు కష్టమొస్తే.. తల్లిదండ్రులు బాధపడతారు. ఆ కష్టాన్ని పిల్లలకు చెప్పకుండా.. కన్నీళ్లను వారే దిగమింగుతారు. తమ ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే.. బిడ్డలను కాపాడుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు భిన్నం. ఆరేళ్ల చిన్నారి.. క్యాన్సర్‌ బారిన పడ్డాడు. నాలుగోదశలో ఉంది. మరో ఆరు నెలలు మాత్రమే బతుకుతాడు. అప్పటికే క్యాన్సర్‌ కారణంగా కుడి చేయి, కాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. వేరే పిల్లలు ఎంత భయపడతారో.. బాధపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ చిన్నారి గుండె ధైర్యం చూసి వైద్యుడు ఆశ్చర్యపోయాడు. తాను ఆరు నెలలు మించి బతకనని తెలుసుకున్న ఆ బాలుడు.. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పవద్దని.. వారికి తెలిస్తే.. తట్టుకోలేరని డాక్టర్‌ను కోరాడు. బాధను దిగమింగి.. తల్లిదండ్రులకే ధైర్యం చెబుతున్న ఆ చిన్నారి పెద్ద మనసుకు డాక్టర్‌ కంట తడి పెట్టుకున్నాడు. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరలవుతోంది. ఆ వివరాలు..

ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సదరు డాక్టర్‌ పేరు సుధీర్‌ కుమార్‌. ఇక డాక్టర్‌ చేసిన ట్వీట్‌లో ఇలా ఉంది.. ‘‘కొన్ని నెలల క్రితం భార్యాభర్తలు ఆరేళ్ల వయసున్న బాలుడితో నా దగ్గరకు వచ్చారు. పిల్లాడిని బయటే ఉంచి నన్ను కలిశారు. తమ బిడ్డకు క్యాన్సర్‌ ఉందని.. దాని గురించి పిల్లాడికి చెప్పవద్దని నాకు వివరించారు. నేను సరే అన్న తర్వాత.. బాబుని లోపలికి తీసుకువచ్చారు. ఆ తర్వాత నేను అన్ని మెడికల్‌ టెస్టుల రిపోర్టులు పరిశీలించాను. ఆ చిన్నారికి ‘గ్లయోబ్లాస్టోమా మల్టీ ఫార్మి’ అనే ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్‌.. అది కూడా నాలుగో దశలో ఉందని గుర్తించాను’’ అని చెప్పుకొచ్చాడు.

hyderabad-doctor-shares-6-years-boy-cancer-story-on-twitter-goes-viral

‘‘ఇక ఆ బాలుడు కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని నాకు తెలుసు. మెదడు ఎడమవైపు ఈ క్యాన్సర్‌ రావడంతో అప్పటికే ఆ బాలుడి కుడి చేయి, కాలుకి పక్షవాతం వచ్చింది. కాసేపటి తర్వాత ఆ బాలుడు తన తల్లిదండ్రుల్ని బయటకు వెళ్లమని చెప్పడంతో.. వారు వెళ్లిపోయారు. అప్పుడు ఆ కుర్రాడు నాతో మాట్లాడాడు. సార్‌.. నాకు క్యాన్సర్‌ వచ్చిందని నాకు తెలుసు. ఈ వ్యాధి పేరును ఐపాడ్‌లో టైప్‌ చేసి అసలు విషయం ఏంటో తెలుసుకున్నాను. అంతేకాదు నేను ఆర్నెల్ల కంటే ఎక్కువ కాలం బతకనని కూడా నాకు తెలుసు. ఈ విషయం మమ్మీడాడీలకు చెప్పలేదు.. వారు తట్టుకోలేరు. ప్లీజ్‌ డాక్టర్‌ మీరు కూడా చెప్పొద్దు అని బాలుడు నన్ను బతిమిలాడాడు’’ అని చెప్పుకొచ్చాడు.

‘‘ఆ పిల్లాడి మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద ఆలోచన చేయగలిగాడు అనుకున్నాను. సరే నేను మీ పేరెంట్స్‌కి చెప్పనులే అని మాట ఇచ్చాను. ఆ తర్వాత బాలుడు నాతో మాట్లాడిన విషయం బాబు తల్లిదండ్రులకు వివరించాను. తన అనారోగ్యం గురించి మీకు ఏం తెలియనట్లే.. ప్రవర్తించమని.. అలా చేస్తే.. కనీసం చివరి రోజుల్లో.. అయినా ఆ బాబు సంతోషంగా ఉంటాడని వివరించాను. ఆమాట విని తల్లిదండ్రులు బాధపడ్డారు. సరే అని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన 9 నెలలు తర్వాత ఇటీవల మళ్లీ ఆ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు’’ అని చెప్పుకొచ్చాడు.

@hyderabaddoctor

‘‘నేను వారిని గుర్తు పట్టి బాలుడి ఆరోగ్యం గురించి ఆరా తీశాను. అయితే నెల క్రితమే బాబు చనిపోయాడని ఆ తల్లిదండ్రులు నాకు చెప్పారు. అంతేకాక.. తామిద్దరూ ఈ 8 నెలలు ఉద్యోగాలకు సెలవు పెట్టి.. కుమారుడి దగ్గరే ఉండి.. తనతో గడిపామని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ విషయం విని నేను కూడా బాధ పడ్డాను. ఇన్న వయసులోనే ఇంత మెచ్యూర్‌గా ఆలోచించిన పిల్లాడిని.. నేను ఇంతవరకు చూడలేదు’’ అంటూ డాక్టర్‌ సుధీర్‌ ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

డాక్టర్ చెప్పిన ఈ స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ చిన్నారి కథ విన్న నెటిజన్లు.. పాపం చనిపోతానని తెలిసినప్పుడు ఆ చిన్నారి ఎంత వేదన అనుభవించి ఉంటాడో కదా.. ఇక ఆ తల్లిదండ్రుల గుండె కోతను వర్ణంచలేం.. చదువుతుంటేనే మాకు తమ గుండె పగిలింది.. అంత చిన్న వయసులోనే బాలుడికి క్యాన్సర్ రావడం.. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి బాధపడకూడదని ఆరేళ్ల వయసులోనే ఇంత గొప్పగా ఆలోచించడం గ్రేట్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ చిన్నారి కథ మీకెలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

6-yr old to me: “Doctor, I have grade 4 cancer and will live only for 6 more months, don’t tell my parents about this”
1. It was another busy OPD, when a young couple walked in. They had a request “Manu is waiting outside. He has cancer, but we haven’t disclosed that to him+

— Dr Sudhir Kumar MD DM🇮🇳 (@hyderabaddoctor) January 4, 2023

Tags :

  • Cancer Patient
  • Hyderabad
  • post viral
  • Telangana
  • Twitter
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కిస్మత్‌పూర్ దురాగతం, మహిళపై అత్యా*చారం, హ*త్య..మ*ర్మాంగంపై కర్రలతో దాడి

కిస్మత్‌పూర్ దురాగతం, మహిళపై అత్యా*చారం, హ*త్య..మ*ర్మాంగంపై కర్రలతో దాడి

  • శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

    శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

  • మిస్టరీ వీడిన డబుల్ మర్డర్ కేసు, పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు

    మిస్టరీ వీడిన డబుల్ మర్డర్ కేసు, పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు

  • ఈ ఇద్దరినీ దూరం చేస్తేనే పార్టీ బతుకుతుంది..కవిత తీవ్ర ఆరోపణలు

    ఈ ఇద్దరినీ దూరం చేస్తేనే పార్టీ బతుకుతుంది..కవిత తీవ్ర ఆరోపణలు

  • స్థానికతపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

    స్థానికతపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • 'NEET, JEE "స్టూడెంట్ మెంబెర్ షిప్" రిజిస్ట్రేషన్ ప్రారంభం

  • తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • రజనీకాంత్‌ను సైతం నో అన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

  • ఆ హీరోతో ఒక్క రాత్రి గడిపేందుకైనా సిద్ధమే, పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  • బలపడనున్న వాయుగుండం, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • బిగ్‌బాస్ తెలుగు 9 ఈ వారం ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఆ టాప్ కంటెస్టెంట్ అవుట్ ?

  • ఓజీ 2 పై క్రేజీ అప్‌డేట్, అకిరా నందన్‌తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam