మీడియా అంటే నిజాన్నిచెప్పేది మాత్రమే కాదు. అభాగ్యులకు అండగా నిలబడేది కూడా. ఒకరి కష్టాన్ని చూసి, మనసు చలించి పోయి వారి బాధ తీరే వరకు తోడుగా నిలవడం కూడా మీడియా బాధ్యత. ఈ విషయంలో సుమన్ టీవీ ఎప్పుడూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే వస్తోంది. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ సుమన్ టీవీ రిపోర్టర్స్ వాలిపోతూ.., వారి పరిస్థితిని సమాజానికి తెలియ చేస్తున్నారు. ఈ విషయంలో సుమన్ టీవీ యాంకర్ నిరుపమ ప్రజల మనసుని గెలుచుకున్నారు.
కడప జిల్లా బద్వేల్ తాలూక గోపవరం మండలం భావ నారాయణ నగర్ లో నివాసం ఉంటున్న ప్రగడ వెంకటేశ్వర్లు పుట్టుకతోనే రెండు కాళ్లు ఒక చెయ్యి చచ్చపడిపోవడంతో అన్నా వదిన వద్ద జీవిస్తున్నాడు. తల్లి, తమ్ముడిని జీవితాంతం సాకుతూ వస్తానని చెప్పిన అన్న అకస్మాత్తుగా టీబీ రోగంతో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత ఇద్దరు పిల్లలు.. తాను తనతో పాటు తన తల్లి భారం వదినపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లు. అయితే విధి మళ్లీ వెక్కిరించిందని.. తన వొదిన క్యాన్సర్ గడ్డతో బాధపడుతూ కన్నుమూసిందని అన్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు.. తన తల్లిని ఎలా సాకాలన్న బాధ తనకు మొదలైందని అన్నారు. తమకు 35 కిలోల రేషన్ బియ్యం.. తనకు మూడు వేలు.. తన తల్లికి రెండువేల రెండువందల పెన్షన్ మాత్రమే వస్తుందని అన్నారు. తాము ఉంటున్న ఇంటి అద్దె రూ.2200 వందలని.. మూడు వేల రూపాయలు ఇంటి ఖర్చు.. తన అన్న పిల్లల అవసరాలకు వాడుతామని అన్నారు. తాను ఇనుప కొట్టులో పని చేస్తున్నానని.. అయితే తాను.. పిల్లల కోసమే బతుకుతున్నా అని.. వారి భవిష్యత్ గురించి భయం వేస్తుందని.. అందుకే మీ ఛానల్ కి వచ్చి మిమ్ముల్ని కలిసి నా బాధ చెప్పుకుంటే ఏదైనా మార్గం చూపించగలుగుతారని.. తనకు ఏదైనా సహాయాన్ని అందించగలరన్న నమ్మకంతో వచ్చినట్లు వెంకటేశ్వర్లు తన ఆవేదన వెలుబుచ్చారు.
వెంకటేశ్వర్లు చెప్పిన మాటలు.. కష్టాలు విని యాంకర్ కన్నీరు పెట్టుకున్నారు.. మా ఛానల్ ద్వారా మీకు ఏ సహాయం కావాలని కోరారు. దానికి వెంకటేశ్వర్లు మా బిడ్డలు.. మా అమ్మా నేనూ లక్షణంగా ఉండాలని.. అది మీ ఛానల్ ద్వారా.. మీ ద్వారా నెరవేరుతుందని ఆశతో ఉన్నానని… ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే మీరు ఏమి చేసేవారు అన్న ప్రశ్నకు.. ఒకటి కాదు మూడు నాలుగు రోజులైనా మిమ్ముల్ని కలిసి.. నా బాధ చెప్పుకునే వరకు వెళ్లేవాడిని కాదు అన్నారు. అయితే తన అన్నకు ఇద్దరు ఆడపిల్లలు.. వారు పెద్ద వారు అయ్యారని.. వారి పెళ్లి చేసే బాధ్యత తనపై ఉందని అన్నారు. మీకు ఎవరైనా బంధువుల లేరా అన్న ప్రశ్నకు.. అన్నవాళ్లు ఉన్నా వారు ఆస్తులు సంపాదించుకొని మమ్ముల్ని పట్టించుకోవడం మర్చిపోయారని కన్నీరు పెట్టుకున్నాడు వెంకటేశ్వర్లు.
మీరు సోనూ సూద్ టీ షర్టు ఎందుకు వేసుకున్నారన్న ప్రశ్నకు.. తనకు సోనూ సూద్ అంటే చాలా ఇష్టమని.. వేల మంది పేద ప్రజలకు ఆయన అండగా ఉన్నారని.. మీ ద్వారా నా బాధలు ఆయనకు తెలిసేలా నాకు సాయం అందేలా చూడాలని కోరారు. ఈ విషయం గురించి యాంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తరుపు నుంచి మీకు సహాయం అందేలా చూస్తామని.. అలాగే తమ ఛానల్ తరుపు నుంచి కూడా మంచి సహాయం అందేలా చూస్తామని అన్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన ఎవరైనా మానవతావాదులు.. స్పందించి తమకు సహాయం చేయడానికి తప్పకుండా ముందుకు వస్తారని అన్నారు సుమన్ టీవీ యాంకర్ నిరుపమ. వివరాలు : Name : Mr.VENKATESHWARLU PRAGADA, Account No: 33973079311, IFSC Code : SBIN0000792.