మన సొంత ఖర్చులు పెట్టుకొని కొనుక్కొని తిన్న దానికంటే, ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మహా సంతోషం ఉంటుందని చాలామంది ఫీలవుతారు. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా వదిలిని వాళ్లకు వందల కొద్ది బతికి ఉన్న చేపలు రోడ్డుపై కనిపించడంతో పండుగ చేసుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పెట్టుకొని మరీ తీసుకొని వెళ్లిపోయారు.
కనీసం లారీ బోల్తా పడిన ఘటనలో ఎవరికైనా గాయాలు తగిలాయా? లారీ డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఎలా ఉందని కూడా జనం పట్టించుకోలేదు. రోడ్డు మీద ట్రాఫిక్ ను ఆపి మరి చేపల కోసం ఎగబడిన జనాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: China: కంపెనీ బంపరాఫర్: పిల్లల్ని కంటే లక్షల్లో బోనస్.. ఏడాది పాటు సెలవులు!
భద్రాద్రి కొత్తగూడెంలో ఒక లారీలో చేపల లోడ్ వెళ్తుంది. అనుకోకుండా ఆ లారీ ప్రమాదానికి గురి కావడంతో వందల కొద్ది చేపలు రోడ్డుపై, చెట్ల పొదల్లో పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న స్థానికులు చేపలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అంతేకాదు రోడ్డు పై వెళ్లున్న వాహనాలు ఆపి మరీ చేతికి అందిన చేపలు వెంట తీసుకు వెళ్లారు. కొంత మంది సంచులు తెచ్చుకోని మరీ చేపలు తీసుకువెళ్లారు.
లారీ బోల్తా పడింది.. అందులో డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఏంటని కూడా పట్టించుకోలేదు. ఒక్కో చేప సుమారు 2 నుంచి మూడు కిలోల బరువు ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి జనాలు అంతా కలిసి సుమారు నాలుగు వేల చేపలను అరగంటలో ఖాళీ చేశారు. రేపు మృగశిరకార్తె కూడా కావడంతో స్థానికులు చేపలను పట్టుకునేందుకు ఎగబడ్డారు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: ఆది పినిశెట్టి పెళ్లి వేడుకలో హీరో నాని సందడి! వీడియో వైరల్!
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే లారీలోని చేపల విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ ఎలా బోల్తా పడింది అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.