తల్లిదండ్రుల నుండి ఆస్తులు బలవంతంగా రాయించుకుని ఇంట్లో నుండి గెంటేసే బిడ్డలు కొందరైతే.. ఇదే ఆస్తి కోసం వారిని కడతేర్చేవారు కొందరు. తల్లిదండ్రులనే కాదూ భార్య, అన్నాదమ్ములు, ఇతర రక్త సంబంధీకులను కూడా చంపేస్తున్నారు.
ఆస్తులు, అంతస్థుల కోసం బాంధవ్యాలను మరచిపోతున్నారు కొందరు. తల్లిదండ్రుల నుండి ఆస్తులు బలవంతంగా రాయించుకుని ఇంట్లో నుండి గెంటేసే బిడ్డలు కొందరైతే.. ఇదే ఆస్తి కోసం వారిని కడతేర్చేవారు కొందరు. తల్లిదండ్రులనే కాదూ భార్య, అన్నాదమ్ములు, ఇతర రక్త సంబంధీకులను కూడా చంపేస్తున్నారు. స్థిర, చర ఆస్తుల కోసం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి కోసం మాజీ భార్యను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాలలో జరిగింది. కాపు కాసి మరీ ఆమెపై వేటు వేశాడు మాజీ భర్త, అతని సోదరుడు, తండ్రి.
దళిత బస్తీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు ఎకరాల భూమి.. ఓ మహిళ దారుణ హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలలోని రాజీవ్ నగర్‌కి చెందిన జంగాల స్వప్న అనే మహిళలకు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భర్త పెళ్లైన రెండేళ్లకు చనిపోవడంతో కోటిపల్లి మండలం వెంచపల్లికి చెందిన వేల్పలు మధును రెండో వివాహం చేసుకుంది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అతడి నుండి విడిపోయిన స్వప్న మూడో వివాహం చేసుకుంది. అయితే ఆమెకు దళిత బస్తీ పథకం కింద మూడు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. తన వల్లే స్వప్నకు ఈ భూమి వచ్చిందని, వెంటనే ఆ భూమిని తన పేర రిజిస్టర్ చేయాలని మధు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.
స్వప్న ససేమీరా అనడంతో.. వీరిమధ్య గొడవ ముదిరింది. భూమి తన పేర రిజిస్టర్ చేయననడంతో ఆమెపై పగ పెంచుకున్న రెండో భర్త మధు.. హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. స్వప్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిందని తెలిసి.. తన తమ్ముడు, తండ్రిని తీసుకొని బైక్‌పై వచ్చి అక్కడ కాపు కాశాడు. మున్సిపల్ కార్యాలయం నుండి స్వప్న బయటకి వెళ్లిన స్వప్న రోడ్డుపై నడుస్తుండగా.. ముగ్గురు మోటారు సైకిల్‌పై వచ్చి కత్తితో దాడి చేశారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ఇష్టాను సారంగా కరష్కంగా పొడిచారు. మెడ నరాలు పూర్తిగా తెగిపోవడంతో స్వప్న రక్తమోడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య చేసిన అనంతరం నిందితులు కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.