నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సంపాదించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ. ఎంతోమంది త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి.
1960వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమం 2014, జూన్ 2న సాకారమైంది. ఆత్మగౌరవం, అస్థిత్వం ప్రాతిపదికన దోపిడీ, వివక్ష, అణచివేత, అసమానతలపై తెలంగాణ సమాజం చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో ఎంతో గొప్పగా నిలిచిపోయింది. నేడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ నేతలు ధూమ్ ధామ్ గా నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ జెండాతో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ.. డప్పు వాయిద్యాలతో వేడుకలు జరిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, జగ్గారెడ్డి సహా ముఖ్య నేతలు సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ పీసీసీ చీఫ్, పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత రావు డప్పు వాయించి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా డ్యాన్స్ చేస్తూ హుషారెత్తించారు.
ఇది కూడా చదవండి: Shantabai: ఈ భార్య వక్రబుద్ది వాళ్ళ కాపురాన్ని కూల్చేసింది! అంతా భర్తకి తెలిసే..!
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగ కేక్ కట్ చేసి నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక గన్ పార్క్ వద్దకు చేరకున్నముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.