నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సంపాదించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ. ఎంతోమంది త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. 1960వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమం 2014, జూన్ 2న సాకారమైంది. ఆత్మగౌరవం, అస్థిత్వం ప్రాతిపదికన దోపిడీ, వివక్ష, అణచివేత, అసమానతలపై తెలంగాణ సమాజం చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో ఎంతో గొప్పగా నిలిచిపోయింది. […]