తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి ప్రజలకు గొప్ప శుభవార్తను అందించారు. వాసాలమర్రిలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని అందుకే దళిత బంధు ద్వారా వారి అకౌంట్ల రూ.10 లక్షలు జమ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఆ గ్రామ ప్రజలకు సంతోషాలకు అవదులు లేకుండా పోయాయి. మొదటగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని సీఎం అన్నారు.
ఈ నేపథ్యంలోనే నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామంలోని దళిత వాడల్లో పర్యటించిన ఆయన అన్ని వైపుల కలియ తిరిగాడు. ఇక అనంతరం మాట్లాడిన ఆయన..ఈ వాసాలమర్రి పరిస్థితి మరి దారుణంగా ఉందని, వెంటనే ఇక్కడ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇక ఆలస్యం చేయకుండా రేపటి నుంచే గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాల అకౌంట్లోకి రూ.10 లక్షలు జమ చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో పాటు వాసాలమర్రిలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దీనిని వెంటనే గ్రామంలోని ఎస్సీలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని సీఎం తెలపారు.