MLA Raja singh comments: తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…”ఎమ్మెల్యే బాల్క సుమన్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. గతంలో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమైంది. కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయని కేటీఆరే ఆ ఫైల్ క్లోజ్ చేశాడు. 1000 మందితో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తా, అమెరికా, ఇజ్రాయెల్ నుంచి కొత్త టెక్నాలజీ తీసుకొస్తానని కేసీఆర్ అన్నాడు. ఆది ఏమైంది.
బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో పట్టుబడిన వారిలో కొంతమంది పైన మాత్రమే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, మిగిలివారిని ఎందుకు వదిలేశారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ అయి ఉన్నారు. బీజేపీలో కూడా కొందరు ఫాల్తుగాళ్లు ఉన్నారు. దీనిపై బండి సంజయ్ దృష్టికి సైతం తీసుకెళ్లాను. ప్రతి పార్టీలో ఫాల్తుగాళ్లు ఉన్నారని, మొన్న పట్టుబడిన వారిలో కాంగ్రెస్పార్టీకి చెందిన వారు, పోలీసు అధికారులు కొడుకులు, ఇతర వి.ఐ.పి ల పిల్లలు కూడా ఉన్నారు. చివరగా నేను చెప్పేది ఒకటే.. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్కౌంటర్చేయాలి. గతంలో కొన్ని సంఘటన విషయంలో మీరు ఎన్కౌంటర్ చేస్తే మేం సపోర్ట్ చేశాం” అంటూ బీజేపీ ఎమ్మెల్యేయ రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి..రాజాసింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.