కొత్త ఫోన్ కొనాలని భావించే వారికి అదిరిపోయే శుభవార్త. సూపర్ సేల్ అందుబాటులోకి వచ్చింది. అదే బ్లాక్ ఫ్రైడే సేల్. బ్లాక్ ఫ్రైడే అనేది ‘థాంక్స్ గివింగ్’ తర్వాత వచ్చే సేల్స్ వీకెండ్. ఇది క్రిస్మస్ ముందు, థాంక్స్ గివింగ్ తర్వాత షాపింగ్ గా బాగా పాపులర్. పాశ్చాత్య దేశాల్లో ఈ సమయంలో మంచి డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ సేల్ మొదలైపోయింది. తాజాగా, శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 24 ( గురువారం) నుంచి 28 వరకు డిస్కౌంట్ సేల్ కొనసాగుతుంది. ఈ ఐదు రోజుల్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచులపై భారీ తగ్గింపు ధర అందిస్తోంది.
ఈ సేల్ లో ధరలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఎస్22 ప్లస్ ధరలు మామూలు రోజుల్లో రూ.72,999 నుంచి ఆరంభమవుతుంటే.. బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.60,000 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లు అయిన.. జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 4 ధరలు సాధారణ రోజుల్లో రూ.80,999 నుంచి మొదలవుతుంటే, ఈ సేల్ లో రూ.67,999 నుంచి లభిస్తున్నాయి. అలాగే.. గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్ ధరలు రూ.31,999 నుంచి రూ.42,999 మధ్య ఉన్నాయి. మీ పాత ఫోన్లను ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా కొత్త ఫోన్లపై మరింత తగ్గింపు పొందొచ్చు.
కొనుగోలు సమయంలో హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డులను ఉపయోగించినట్లయితే అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5Gని బ్యాంక్ డిస్కౌంట్ తో రూ. 14,649కే కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా శాంసంగ్ 65 ఇంచెస్ QLED అల్ట్రా HD స్మార్ట్ TV, గెలాక్సీ ఎం13, గెలాక్సీ ఎం33 5G, గెలాక్సీ ట్యాబ్ ఏ8 వంటి మొదలైన వాటిపై కూడా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ షాప్ యాప్ కానీ..సమీపంలోని ఎలక్ట్రానిక్ స్టోర్లకు వెళ్లి ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
Black Friday alert! The sale is now live. Get your favourite Galaxy devices and get benefits up to ₹ 45000*. Don’t miss out! Offer lasts only till 28 Nov, 2022. Visit: https://t.co/Hi2MMxkdLo. *T&C apply. #Samsung pic.twitter.com/35C77mF02T
— Samsung India (@SamsungIndia) November 23, 2022