ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఆఫర్ ఇది. Samsung Galaxy A35ను ఇప్పుడు కేవలం 10 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. 33 వేల ఫోన్ అంత తక్కువ ధరకు ఎలాగని చూస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం.
బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు కొనే ఆలోచన చేస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ వాల్యూ వీక్ డీల్ సందర్భంగా ఈ ఆఫర్ లభించనుంది. ఇందులో భాగంగా Samsung Galaxy A35 ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కేవలం 10 వేలకే కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం ఇది. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుంది, ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 అనేది ఓ 5జి ఫోన్. ఇది 6.6 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ప్రోసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. సెక్యురిటీ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటంతో అద్భుతమైన పనితీరుతో ఉంటుంది. ఇక కెమేరా విషయానికొస్తే ట్రిపుల్ సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్ కాగా సెకండరీ కెమేరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమేరా మెగాపిక్సెల్‌తో ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 500033 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఆఫర్ ఎలా వర్తిస్తుంది
శాంసంగ్ గెలాక్సీ ఏ35 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర 33,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ 35 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంటే డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ 21,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక వివిద బ్యాంక్ ఆఫర్లలో భాగంగా మరో 1100 రూపాయలు తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ మరో 10 వేల వరకూ లభిస్తుంది. ఎక్స్చైంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఈ ఫోన్ మీరు కేవలం 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.