ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి లేటెస్ట్ మోడల్ ఫోన్ Realme 15 Pro 5Gపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను కేవలం 1999 రూపాయలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ముఖ్యంగా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఇందులో భాగంగా Realme 15 Pro 5G కలలో కూడా ఊహించని ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఏకంగా 32 వేల రూపాయలు బోనస్ లభించనుంది. కొన్ని రకాల ఆఫర్లు వర్తిస్తే కేవలం 1999 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. వాస్తవానికి Realme 15 Pro 5G మార్కెట్‌లో వచ్చింది ఈ మధ్యనే. జూలై 24న లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.8 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
అద్భుతమైన కెమేరా
ఇక కెమేరా విషయంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ కెమేరాలు ఉన్నాయి. సెల్ఫీకోసం 50 మెగాపిక్సెల్ కెమేరా మరో ఆకర్షణ. మరే ఇతర స్మార్ట్‌ఫోన్‌లో లేనివిధంగా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌లో 256 జీబీ స్టోరేజ్ వెర్షన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. మార్కెట్ ధర 37,999 రూపాయలు కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో 10 శాతం డిస్కౌంట్‌తో 33,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అయితే కొన్ని ఆఫర్లు వినియోగించుకుంటే 34 వేల ఈ ఫోన్‌ని కేవలం 1999 రూపాయలకే పొందవచ్చు.
1999 రూపాయలకే Realme 15 Pro 5G
రియల్‌మి 15 ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ధర 33,999 రూపాయలు కాగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5,458 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు 30 వేల వరకూ బోనస్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఈ ఫోన్‌ను కేవలం 1999 రూపాయలకే పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది.