బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. కలలో కూడా ఊహించని అతి తక్కువ ధరకే వీటిని సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు అందిస్తోంది. ఈ వివరాలు మీ కోసం.
ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఫ్రీడం సేల్ నడుస్తోంది. వివిధ రకాల బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరకే తీసుకోవచ్చు. Coocaa S4U స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. 32 అంగుళాల ఈ టీవీ అసలు ధర 14 వేలు కాగా ఫ్లిప్‌కార్డ్ ఆఫర్‌లో భాగంగా కేవలం 5,449 రూపాయలకే పొందవచ్చు. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర 7499 రూపాయలుగా ఉంది. మీ పాత టీవీ ఎక్స్చేంజ్ ద్వారా 2 వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంటుంది. దాంతో ఈ టీవీని మీరు కేవలం 5499 రూపాయలకే పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 1250 రూపాయలు తగ్గుతుంది. కూలిటా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీ అన్ని ఓటీటీలను సపోర్ట్ చేస్తుంది. రిజల్యూషన్ HD Ready 1366/768 పిక్సెల్స్ ఉంటుంది. డాల్బీ ఆడియో స్పీకర్లతో 30 వాట్స్ అవుట్ పుట్ కలిగి ఉంటుంది. ఇన్ని ఫీచర్లు కలిగిన టీవీ 5 వేలకు లభించడం అంటే మాటలు కాదు.
10 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 4 వేలకే
ఇక ప్రముఖ బ్రాండ్ వివో స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో కేవలం 4 వేలకే సొంతం చేసుకోవచ్చు. Vivo T4 Lite ఇది. 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ ఫోన్ 6జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం మరో ప్రత్యేకత. 50 మెగాపిక్సెల్ ప్రైమ్ కెమేరా, మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో వస్తున్న ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 9,999 రూపాయలు కాగా 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 10,999 రూపాయలు. ఇక 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 12,999 రూపాయలుగా ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో 4 వేలు తగ్గింపు లభిస్తోందగి. వివిధ బ్యాంక్ ఆఫర్లతో మరో 5 శాతం తగ్గుతుంది. అంటే 10 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 4 వేలకే సొంతం చేసుకోవచ్చు.