ఒకప్పుడు ఫోన్ అంటే.. 2 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ కెమెరా.. అదే 10 మెగా పిక్సల్ అంటే ఓ మై గాడ్ అనేవారు. మరి ఇప్పుడు 50 మెగా పిక్సల్ కెమెరా సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి తరుణంలో మోటోరోలా సంస్థ ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరాతో ఓ ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పటికే.. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని.. కెమెరా జోలికి చాలా వరకు ఎవ్వరూ వెళ్లట్లేరు. ఇప్పుడు మోటోరోలా కొట్టిన 200 దెబ్బతో ఆ వంక ఎవరైనా చూస్తారా లేదా అన్నది కూడా చూడాలి.
ఖరీదైన కెమెరాతో తీస్తే వచ్చే ఫోటోలు ఎంత క్వాలిటీగా, క్లారిటీగా ఉంటాయో.. అంతే క్వాలిటీ, క్లారిటీతో ఉన్న ఫోటోలని స్మార్ట్ ఫోన్‌లో ఉన్న కెమెరా కూడా ఇస్తోంది. దీంతో కస్టమర్లు కూడా హయ్యర్ కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఫోటోలేం కర్మ.. ఏకంగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోటోరోలా తీసుకొచ్చిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్‌ట్రా (200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్) స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రభంజనాన్నే సృష్టించొచ్చు. దీనితో పాటు మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ను లాంచ్ చేసింది. వీటి ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయి? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 30 అల్‌ట్రా ధర:
ఇందులో 8జీబీ+ 128జీబీ వేరియంట్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.59,999. అయితే.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద రూ.5,000 తగ్గించింది. తద్వారా రూ.54,999 ధరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది. అలాగే.. ఎడ్జ్ 30 ఫ్యూజన్ (8జీబీ + 128జీబీ) రూ. 42,999 ధరకు లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీనిని రూ. 39,999కు సొంతం చేసుకోవచ్చు.
Motorola Edge 30 Ultra 5G launched in India.
200MP HP1 OIS+50MP+12MP
60MP front pic.twitter.com/3SY6SgPTcm— Govardhan Reddy (@gova3555) September 13, 2022
స్పెసిఫికేషన్స్:
ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. ప్రీమియం ఫ్లాగ్ షిప్ చి సెట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 4,610mAh బ్యాటరీ అందించారు. ఇది 125W వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 30 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కెమెరా గురించే. ఇందులో 200మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్ ఉండటం విశేషం. కెమెరా హెచ్‌డీఆర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మెయిన్ సెన్సార్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. ప్రధాన కెమెరాతో పాటు 50మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలీఫోటో పోర్ట్‌రైట్ కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 200 మెగా పిక్సల్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Say hello to endless edges and the industry’s highest-resolution camera system, only on motorola edge 30 ultra 👋.#findyouredge pic.twitter.com/NxyAk8z7n0
— Motorola (@Moto) September 9, 2022