ఈ మద్య క్రీడారంగంలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ బాక్సింగ్‌లో చాంపియన్ షిప్ లో ఎంతో గొప్ప పేరు పొందిన బాక్సర్ ముసా యమక్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. ఉగాండాకు చెందిన హమ్జా వండేరా తో రింగ్‌లో ముసా యమక్ ఒక రేంజ్ లో తలపడ్డాడు. అదే సమయంలో ఉన్నట్టుండి ముసా యమక్ ఒక్కసారే రింగు లో కుప్పకూలిపోయాడు.
మొదటి రెండు రౌండ్లు బాగానే ఆడిన ముసా.. రెండవ రౌండ్‌లో వండెరా భారీ పంచ్‌తో ముసాకు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాచ్ మూడవ రౌండ్ ఆరంభంలో బాక్సర్ ముసా కుప్పకూలాడు. ముసా యమక్ తన చిన్న వయస్సులోనే మృత్యువాత పడటంతో విషాదం నెలకొంది.
నిర్వహకులు వెంటనే వైద్యం అందించినప్పటికీ అతన్ని కాపాడ లేక పోయారు. జర్మనీకి చెందిన బాక్సర్ ఇప్పటి వరకు ఎదురులేని మనిషిగా మూసా తన సత్తాచాటుతూ వచ్చాడు. 8-0 రికార్డుతో అతను దూసుకెళ్తున్నాడు. టర్కీలో పుట్టిన ముసా యామక్ 2017లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. మూసా మరణంపై ఆ దేశ అధికారి ట్విట్టర్ ద్వారా ఒక గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.