‘నాకు అప్పుడు ఎనిమిదేళ్లు. క్రికెట్ అంటే ఏంటో అసలు నాకైతే తెలీదు. అలాంటి నేను.. క్రికెట్ గురించి కాస్తోకూస్తో తెలిసిన
మా నాన్నతో కలిసి 2003 ప్రపంచకప్ చూశాను. టీవీ అయితే చూస్తున్నాను గానీ దాన్ని క్రికెట్ అంటారని, బ్యాట్ బాల్ తోనే ఈ గేమ్ ఆడతారని నాకు అప్పుడే తెలిసింది. మన జట్టు ఆడిన ఫస్ట్ మ్యాచ్ కి ముందు క్రికెట్ అంటే ఏంటో తెలియని నేను.. ఆస్ట్రేలియాతో మన జట్టు ఫైనల్ ఆడేసరికి తినడం కూడా మర్చిపోయి మ్యాచ్ చూశాను. అందులో మన జట్టు ఓడిపోయేసరికి చాలా బాధపడ్డాను. కట్ చేస్తే సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2011లో వన్డే వరల్డ్ మన జట్టు గెలిచేసరికి ఆనందం తట్టుకోలేకపోయాను. సరిగా భోజనం చేయలేదు.. రాత్రంతా నిద్రపోలేదు కూడా. క్రికెట్ అంటే అంత పిచ్చి నాకు’… ఇది నా అనుభవం మాత్రమే కాదు చాలామందిది సేమ్ ఫీలింగ్. అలానే మన వాళ్లకు వేరే ఏం గేమ్ గురించి తెలియకపోయినా సరే క్రికెట్ లో ఫుల్ నాలెడ్జ్. అసలు ఈ ఒక్క గేమే.. మన దగ్గర ఎందుకింత పాపులర్ అయింది?
ఇక అసలు విషయానికొస్తే.. ఎవరి ఇంట్లోనైనా సరే పిల్లాడు పుట్టడమే లేటు. చేతిలో తీసుకొచ్చి బొమ్మబ్యాట్ పెడతారు. తల్లిదండ్రులు, బంధువులు చాలా గిఫ్ట్స్ తీసుకొస్తారు. అందులోనూ క్రికెట్ బ్యాట్ లేదా బంతి కచ్చితంగా ఉంటుంది. అలా పుట్టగానే.. క్రికెట్ అనేదాన్ని పిల్లాడికి పరిచయం చేస్తారు. కాస్త నడుస్తున్నాడు అనే టైంకి క్రికెట్ ఆడటం నేర్పించేస్తారు. ఇది దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ జరుగుతూ ఉంటుంది. డబ్బున్నవాళ్లయితే పిల్లాడిని తీసుకెళ్లి కోచింగ్ సెంటర్ లో చేర్పిస్తారు. డబ్బు లేనివాడు.. కొడుక్కి చెక్క బ్యాట్ ఇచ్చి ఆడుకోమంటాడు. ఏదైనా సరే క్రికెట్ మాత్రం మన లైఫ్ లో నుంచి అస్సలు దూరం కాకుండా మన పేరెంట్స్, ఫ్రెండ్స్ చూస్తారు.
ఇక క్రికెట్ మన దేశంలో ఎందుకంత ఫేమస్ అయ్యింది అనే విషయానికొస్తే.. ఫస్ట్ చెప్పుకోవాల్సింది సింప్లిసిటీ. ఏ గేమ్ ఆడాలన్నా సరే దానికి తగ్గ ఎక్విప్ మెంట్ చాలా కావాలి. క్రికెట్ కు అదేం అక్కర్లేదు. బ్యాట్, బాల్ ఇద్దరు మనుషులు ఉంటే చాలు. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చి పిల్లలు బయట కనిపించట్లేదు గానీ స్మార్ట్ ఫోన్లు రాకముందు ఏ వీధిలో, ఏ గల్లీలో చూసినా సరే ఎవరో ఒకరు క్రికెట్ ఆడుతూనే ఉండేవారు. ఇక మిగతా గేమ్స్.. కొన్ని ఏజ్ గ్రూప్స్ మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. అదే క్రికెట్ లో మాత్రం అలాంటిది ఏం ఉండదు. అప్పుడే నడక స్టార్ట్ చేసిన పిల్లాడి దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు ఇంట్రెస్ట్ ఉండాలే గానీ ఎవరైనా సరే క్రికెట్ ఆడేయొచ్చు. అలానే మన దేశంలో వేరే ఏ గేమ్ కి లేనన్ని కోచింగ్ సెంటర్స్, కేవలం క్రికెట్ కు మాత్రమే ఉన్నాయి. ఇలా ఏది అనుకున్నా సరే మనకు క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెంచుతాయే తప్ప అస్సలు తగ్గించవు.
1932లో ఫస్ట్ టైం మన దేశంలో ఓ టెస్టు మ్యాచ్ కండక్ట్ చేశారు. అది జరిగినప్పుడు.. కనీసం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. క్రికెట్ ఇంత ఫేమస్ అవుతుందని, అందుకు తగ్గట్లే 1983లో తొలి ప్రపంచకప్ గెలిచింది. ఇక 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తర్వాత టీమిండియా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక కపిల్ దేవ్, సచిన్, గావస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా వరల్డ్ క్లాస్ క్రికెటర్లు కూడా మన వాళ్లే కావడం కూడా క్రికెట్ మన దగ్గర ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఇకపోతే మన దేశంలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్రికెట్ మాత్రమే చూస్తారు. దాదాపుగా క్రికెట్ మాత్రమే ఆడతారు. హాకీ మన జాతీయ క్రీడ అయినా దాని గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఇక కబడ్డీ లాంటి గేమ్స్ కి అయితే ఆదరణ తక్కువ. ఏదో కబడ్డీ లీగ్ వచ్చిన తర్వాత కొంతమందైనా ఈ క్రీడని చూస్తున్నారు గానీ అల్టిమేట్ గా ఐపీఎల్ లాంటి లీగ్స్ నే ఇష్టపడతారు. తిండైనా మానేస్తారు గానీ మ్యాచ్ చూడటం మాత్రం అస్సలు మర్చిపోరు. అలానే క్రికెటర్లకు కోట్లలో జీతాలు ఇస్తారు. మిగిలిన గేమ్స్ ఆడే ప్లేయర్లని మాత్రం ఎవరూ కనీసం పట్టించుకోరు. ఏదో బ్యాడ్మింటన్ లో పీవీ సింధు, టెన్నిస్ లో సానియా మీర్జా తప్పించి.. ఆయా గేమ్స్ లో మిగిలిన ప్లేయర్ల ఎవరైనా మీకు తెలుసా అంటే ఒక్కరూ కూడా ఆన్సర్ చెప్పలేరు. అలా మిగిలిన గేమ్స్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం కూడా క్రికెట్ కు ప్లస్ అవుతూనే ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే పైన మేం చెప్పినవి కాకుండా క్రికెట్ ఫేమస్ కావడానికి వేరే రీజన్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
LEGENDS!#Cricket #CricketTwitter pic.twitter.com/sWHaiK2wnu
— RVCJ Sports (@RVCJ_Sports) January 6, 2023