ఆండ్రీ రస్సెల్.. ఈ పేరు వినగానే క్రికెట్ మైదానంలో విధ్వంసమే గుర్తొస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ను తిప్పేయగల సమర్థుడు. బ్యాటుతోనే కాదు.. బాల్ తోనూ ప్రత్యర్థులను నానా ఇబ్బందులు పెట్టగలడు. అంతటి సమర్థుడు కాబట్టే.. కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం.. ఐపీఎల్ 2022 సీజన్లో రూ.12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అతడికి పెట్టిన ప్రతి రూపాయికి ఆండ్రీ రస్సెల్ న్యాయం చేయడం చూశాం. ఐపీఎల్ 2022లో 14 మ్యాచుల్లో 335(70* అత్యధిక స్కోరు ) పరుగులు చేశాడు. బౌలింగ్ లో 28.1 ఓవర్లు వేసి.. 17 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం ఆండ్రీ రస్సెల్ క్యాష్ రిచ్ లీగ్ ముంగింపు దశలో ఉన్నందున స్వదేశం చేరుకున్నాడు. కాస్త వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించిన ఆండ్రీ రస్సెల్.. ఖరీదైన మెర్సిడీజ్ బెంజ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారులో కూర్చుంటున్న వీడియో ఒకటి తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఫుల్ గ్రీన్ కలర్ లో ఉన్న ఆ మెర్సీడీజ్ ఏఎంజీ జీటీ బెంజ్ కారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోతో పాటు.. ఆండ్రీ రస్సెల్ పెట్టిన కొటేషన్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘నేను ఎప్పుడు పెద్ద కలలనే కంటుంటాను. దేవుడు మంచివాడు.. మనం చేసే కృష్టి, త్యాగాల వల్ల మన కలలు నిజమవుతాయి.’ అంటూ సునీల్ నరైన్ ని ట్యాగ్ చేశాడు. రస్సెల్ పోస్టుకు సూర్యకుమార్ యాదవ్, క్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపారు. ఆండ్రీ రస్సెల్ కొనుగోలు చేసిన ఈ కారు గరిష్ఠంగా రూ.2.90 కోట్ల వరకు ఉంటుంది. రస్సెల్ కొత్త కారు కొనడంపై కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.