దేశంలోనే వన్ ఆఫ్ బెస్ట్ కపుల్స్ గా భావించే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ పిక్ పై ట్రోలింగ్ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో అనుష్క కి ఎంత పాపులారిటీ ఉందో అంతకు మించిన ఫాలోయింగ్ విరాట్ కోహ్లీ సొంతం. దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జోడీగా వీరిద్దరూ సరి కొత్త ట్రెండ్ సృష్టించారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లను కలిగిన ఈ జంట.. ఒక్క పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ, అనుష్క శర్మ దిగిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. విరాట్ కోహ్లీ సంగతి పక్కన పెడితే అతని సతీమణి అనుష్కపై కొంతమంది చెత్త కామెంట్స్ చేశారు. ఇంతకు అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
విండీస్ తో టెస్టు సిరీస్ ఆడిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత జరిగిన వన్డే టెస్టుల నుంచి విశ్రాంతి లభించింది. ఈ గ్యాప్ లో కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయిన విరాట్..దర్శనీయ ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే బార్బడోస్ లోని ఒక ఫేమస్ కేఫ్ కు వెళ్లారు ఈ దంపతులు. ఆ కేఫ్ ముందు దిగిన ఫొటోను కోహ్లీ తన ఇన్ స్టాలో పంచుకున్నాడు. బార్బడోస్ లో కచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు నెటిజన్లు ఆమెను బాడీ షేమింగ్ చేస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు.
విరుష్క దంపదులు దిగిన ఈ ఫోటోలో కోహ్లీ బ్లాక్ టీ షర్ట్- షార్ట్ వేసుకుని ఉండగా.. అనుష్క లూజ్ బ్లూ షర్ట్-షార్ట్ వేసుకుంది. ఈ పిక్ లో అనుష్క శర్మ చాలా సన్నగా కనిపించింది. “అనుష్క జీ మీ చేతిలో నరాలు కనిపిస్తున్నాయి కాస్త తిండి తినండి” అంటూ కొంత మంది వ్యంగ్యంగా కామెంట్లు పెడితే.. ఇంకొంత మంది అనుష్క ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది.. పాపం ప్యాంట్ ఇవ్వండి అంటూ విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అనుష్క శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.