SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Targeting Rohit Sharma In Captaincy Issue

కోహ్లీకి రోహిత్ గౌరవం ఇవ్వడం లేదా? మళ్లీ జట్టులో గొడవలు?

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో తనకు విలువ లేదని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కోహ్లీ తన బాధను చెప్పుకున్నాడా? లేక రోహిత్‌ శర్మను టార్గెట్‌ చేశాడా? అనే విషయంపై క్రికెట్‌ అభిమానులు తెగ మదనపడిపోతున్నారు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 28 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీకి రోహిత్ గౌరవం ఇవ్వడం లేదా? మళ్లీ జట్టులో గొడవలు?

‘కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా సర్దుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. కెప్టెన్సీ చేసిన అలవాటులో ఏదైనా చెప్పాలని అనుకున్నా.. నేను కెప్టెన్‌ కాదు అని నాకు నేను చెప్పుకుని కామ్‌గా ఉండిపోయేవాడిని, అయినా మన అభిప్రాయానికి విలువ లేని చోట ఏది చెప్పినా అది అవివేకం అవుతుంది. కానీ, ఆర్సీబీ విషయంలో నాకు ఈ ఇబ్బంది లేదు. డుప్లెసిస్‌కు నేను ఏది చెప్పిన వింటాడు. నా మాటకు గౌరవం ఇస్తాడు.’ ఈ మాటలు టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం జట్టులో సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ అన్నవి. వినేందుకు చాలా సాధారణంగానే ఉన్నా.. వాటి లోతుల్లో చాలా అర్థాలే దాగున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో మాజీ కెప్టెన్‌ ఉన్న కోహ్లీ మాటకు ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని కోహ్లీ చెప్పిన దాంతో స్పష్టం అవుతుంది.

అయితే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? అంటే ఆ విషయం కోహ్లీ-రోహిత్‌ ఇద్దరికే తెలియాలి. అయితే.. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత విరాట్‌ కోహ్లీ ఫామ్‌ చాలా దారుణంగా దెబ్బతింది. ఏ ఫార్మాట్లలో కూడా కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. ఇలాంటి సమయంలో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని, యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలని కూడా డిమాండ్‌ వ్యక్తం అయింది. ఒకానొక దశలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో.. కోహ్లీ ఫామ్‌పై, జట్టు నుంచి తప్పించే విషయమై, అలాగే కోహ్లీకి కాన్ఫిడెన్స్‌ తగ్గిందని భావిస్తున్నారా? అంటూ ఎదురైన కఠిన ప్రశ్నలకు రోహిత్‌ ఒక్క నవ్వుతో సమాధానమిచ్చి, కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడికి కాన్ఫిడెన్స్‌ అవసరం ఉందంటారా? అంటూ కోహ్లీకి మద్దతుగా నిలాచడు. కోహ్లీ లాంటి ఆటగాడి అవసరం టీమిండియాకు ఎంతో ఉందని నమ్మిన వారిలో రోహిత్‌ శర్మ కూడా ఒకడు.

virat-kohli-targeting-rohit-sharma-in-captaincy-issue

కెప్టెన్‌గా జట్టులో సీనియర్‌ ప్లేయర్‌ అయిన కోహ్లీకి కావాల్సినంత ఫ్రీడమ్‌ ఇస్తూ.. అతను ఫామ్‌ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్‌ శర్మ. ఆసియా కప్‌ 2022లో కోహ్లీ ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో చెలరేగి, తిరిగి ఫామ్‌ అందుకున్న సమయంలోనూ స్వయంగా రోహిత్‌ శర్మనే కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించిన తర్వాత.. గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్‌.. కోహ్లీని అమాంతం ఎత్తుకున్నాడు. ఇలా పలు సందర్భాలతో కోహ్లీ-రోహిత్‌ మధ్య విభేదాలు లేవని అభిమానులు మెల్లమెల్లగా నమ్మడం ఆరంభించారు. కానీ.. ఎప్పుడు తన కెప్టెన్సీ ప్రస్తావన వచ్చినా ధోని గురించి మాట్లాడే కోహ్లీ, బ్యాడ్‌ టైమ్స్‌లో తనకు మద్దతుగా నిలిచి, తనపై నమ్మకం ఉంచిన రోహిత్‌ శర్మ గురించి ఒక్క మాట మాట్లాడిన దాఖలా లేదు.

ఇటివల టీమిండియా మాజీ చీఫ్‌​ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ స్టింగ్‌ ఆపరేషన్‌లోనూ.. రోహిత్‌ శర్మ-కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నా, రోహిత్‌ శర్మ మాత్రం కోహ్లీని టీమ్‌లో ఉంచేందుకు గట్టిగా నిలబడ్డాడని, కోహ్లీ బ్యాడ్‌ ఫేజ్‌లో రోహిత్‌ మద్దతుగా నిలబడ్డాడని చేతన్‌ శర్మ వెల్లడించాడు. అయినా కూడా ఏనాడు కోహ్లీ, రోహిత్‌ శర్మ గురించి పాజిటివ్‌గా మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆర్సీబీలో డుప్టెసిస్‌తో ఉన్నంత చనువు, ఆర్సీబీలో తనకు దక్కుతున్న గౌరవం టీమిండియాలో లేదనే అర్థం వచ్చేలా.. రోహిత్‌ శర్మను టార్గెట్‌ చేస్తూ మాట్లాడాడు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు విరాట్‌ కోహ్లీ ఇలా టీమ్‌లో కల్లోలం సృష్టించే వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా జట్టుకు నష్టం చేస్తుంది. అయినా.. విభేదాలను పక్కనపెట్టి రోహిత్‌ తనకు మద్దతుగా నిలబడితే.. కోహ్లీ ఇలా టార్గెట్‌ చేస్తూ మాట్లాడటంపై క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఏదో జరుగుతుందనే భావనను క్రియేట్‌ చేసేలా కోహ్లీ వ్యాఖ్యలు ఉన్నాయని, టీమ్‌ వరల్డ్‌ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కోహ్లీ కామెంట్‌ జట్టులో అలజడి రేపుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Virat Kohli (in RCB Podcast) said “MS Dhoni was the only person who genuinely reached out to me during my lean patch in 2022, for me it’s a blessing to have a pure bond with Dhoni”.

— Johns. (@CricCrazyJohns) February 25, 2023

Virat Kohli opens up about his camaraderie with MS Dhoni, on @eatsurenow presents #RCBPodcast

ICYMI, Watch the full episode on RCB Youtube Channel and listen to the audio versions of all the 10 episodes of the podcast on Spotify and Apple Podcasts#PlayBold @danishsait pic.twitter.com/CBE9X3y1Wg

— Royal Challengers Bangalore (@RCBTweets) February 26, 2023

Tags :

  • Cricket News
  • Rohit Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam