భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. దీని ఆదాయం ముందు ఐసీసీ ఆదాయం కూడా వెలవెలబోతుంది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐకి ..ఒక్క ఐపీఎల్ ద్వారానే ప్రతి ఏడాది రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్లు ఆదాయం సమకూరుతోంది. మరి ఇంత ఆదాయం గడిస్తున్న బీసీసీఐ.. ఆ డబ్బంతా ఏం చేస్తోంది. రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు చెల్లించేట్లేదా?. ఒకవేళ.. చెల్లిస్తుంటే ఆ డబ్బంతా ఏమవుతోంది?. ఎందుకు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు.. దేశవాళీ క్రికెటర్లకు జీతాలు సక్రమంగా చెల్లించలేకపోతున్నాయి?. సర్.. ఆకలేస్తుంది అని కడుపారా అడిగిన ఆటగాళ్లకు.. రోజుకు వంద ఇస్తున్నాం కదా.. స్విగ్గీలో ఆర్డర్ లో చేసుకొని తిను అని ఎందుకు సమాధానమిస్తున్నారు?. ఈ వార్త చదివిన వారికి ఇదంతా నిజామా అనిపించకమానదు. కానీ, ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డులో జరుగుతోంది ఇదే.
నిబంధనల ప్రకారం ఉత్తరాఖండ్ లో నెలనెలా ఇచ్చే జీతాలతో పాటు డీఏ కింద ఒక సీనియర్ క్రికెటర్ కు రోజుకు రూ. 1,500 చెల్లించాలి. ఒక్కోసారి ఇది వెయ్యి, రూ. 2 వేలుగా ఉంటుంది. కానీ గడిచిన ఏడాది కాలంగా ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న క్రికెటర్లకు ఇచ్చే రోజువారీ అలవెన్స్ (డీఏ) అక్షరాలా వంద రూపాయలు. పోనీ, బీసీసీఐ నుంచి ఫండ్స్ రావట్లేదా అంటే వస్తున్నాయి. అవి ఎటుపోతున్నాయో తెలియయట్లేదు.
Rich admins and poor sportspersons
‘Rs 35 lakh for bananas and water bottles worth Rs 22 lakh. And players get Rs 100 per day as an allowance’https://t.co/pwBJTdzr0X https://t.co/KxJSIMVr8O
— Peaches (@peachesnplums) June 10, 2022
ఒక నివేదిక ప్రకారం.. సీఏయూ.. ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు ఆడిట్ లెక్కలు తనిఖీ చేస్తే ఫుడ్, ఇతర ఖర్చుల కోసం భారీగా వెచ్చిస్తున్నట్టుగా తేలింది. గతేడాది ఫుడ్ కోసం.. రూ. 1,74,07,346 కోట్లు, రోజువారీ అలవెన్సుల కోసం రూ. 49,58,750 లక్షలు క్లెయిమ్ చేసినట్లుగా ఉంది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. అరటి పండ్లకు రూ. 22 లక్షలు, వాటర్ బాటిల్స్ కోసం రూ.35 లక్షలు ఖర్చు చేసినట్టు రాసి ఉంది. మరి ఈ సొమ్మంతా ఎక్కడికి పోతుంది..? అనేది మాత్రం సస్పెన్స్.
The sad story of Uttarakhand cricket.
Min wage per day of unskilled labour in the state – 800 Rs
Min wage per day of cricketers in the same state – 100 Rs.BCCI is the richest board and still their cricketers suffering to find a way to live the lifehttps://t.co/D49iZWMj0e
— Johns. (@CricCrazyJohns) June 10, 2022
జీతభత్యాల కోసం క్రికెటర్లు ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేసన్ (సీఏయూ) ను అడిగి అడిగి అలిసిపోయారు. డీఏ ఒక్కటే కాదు.. మ్యాచులు జరుగుతున్న సమయంలో పెండింగ్ డ్యూస్ చెల్లించాలని, తమకు భోజన ఖర్చులకు డబ్బులు లేవని అడిగితే స్విగ్గీ, జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవాలని సూచించాడట. తమకు రావాల్సిన జీతాలు, ఇతరత్రా భత్యాల గురించి ఓ సినీయర్ ప్లేయర్ సీఏయూ అధికారులను నిలదీస్తే అతడు చెప్పిన సమాధానం.. ‘అరె.. ప్రతిసారి ఇదే ప్రశ్న అడుగుతున్నావ్.. మీకు డబ్బులిస్తాం. మేమెక్కడికి వెళ్లం. అప్పటిదాకా స్విగ్గీలోనే జొమాటోలోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోపోండి’ అని దురుసుగా సమాధానమిస్తున్నారట.
Video from the dharna staged on May 20, 2022 during the Gold Cup in Dehradun against alleged corrupt practices and sifaarishi selections within the Cricket Association of Uttarakhand.
https://t.co/KGuhlqPzWi#UttarakhandCricket #Uttarakhand pic.twitter.com/0trwxJBSWy
— cricket chronicles 🏏🏏 (@kartike48655021) June 10, 2022
ఈ రోజుల్లో ఒక దినసరి కూలీ రోజువారీ సంపాదన ఎంత లేదన్నా.. రూ. 500 నుంచి 700 సంపాదిస్తున్నాడు. వీళ్లతో పోల్చితే ఉత్తరాఖండ్ క్రికెటర్ల పరిస్థితి అధ్వాన్నమే కదా. సీఏయూలో అవినీతి రాజ్యమేలుతుందని.. వారి వల్లే రాష్ట్ర క్రికెట్ అదోగతి పాలైందని స్థానిక క్రికెటర్లు వాపోతున్నారు. మరి ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు గా పేరున్న బీసీసీఐ.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా..? లేదా..? అనేది వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.