ఐపీఎల్ పుణ్యమా అంటూ తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీమిండియాలో తొలిసారి స్థానం దక్కింది. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన ఈ ఆంధ్ర కుర్రాడు తన సక్సెస్ గురించి చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్ లో స్థానం సంపాదించాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆటగాళ్లకు టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక తెలుగు క్రికెటర్లు భారత జట్టులో చోటు సంపాందిలంటే అది దాదాపు ఆసాధ్యం అనే చెప్పాలి. ఇక్కడ టాలెంట్ తో ముందుకెళ్లినా ప్రోత్సహించేవారు ఎవరూ ఉండరు. ఒకసారి చరిత్ర చూసుకుంటే మన తెలుగు క్రికెటర్లు భారత జట్టులోకి సగటున దశాబ్దానికి ఒక్కరు మాత్రమే వస్తున్నారు. ఇక వీరిలో గ్రేట్ ప్లేయర్స్ ఎవరంటే అజరుద్దీన్, లక్ష్మణ్ తప్ప ఎవరూ ఉండరు. అయితే ఐపీఎల్ పుణ్యమా అంటూ తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీమిండియాలో తొలిసారి స్థానం దక్కింది. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన తిలక్ వర్మ తన సక్సెస్ గురించి చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్ జట్టులో తిలక్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్నాడు. కానీ ఈ కుర్రాడి మీద సెలక్టర్ల చూపు పడలేదు. దాంతో తిలక్ వర్మ భారత జట్టులోకి రావటానికి మరింత సమయం పడుతుంది అని భావించారు. అయితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశం కొట్టేసిన ఈ ఆంధ్ర కుర్రాడు స్టార్ ప్లేయర్ల గాయంతో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ తరపున డబ్యూ చేసిన తిలక్ వర్మ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకున్నాడు. సందర్భాన్ని బట్టి గేర్ మారుస్తూ ముంబై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒంటి చేత్తో ముంబైకి విజయాలు అందించిన మ్యాచులు కూడా ఉన్నాయి. ముంబై జట్టులో ఎంతో మంది స్టార్ బ్యాటర్లు ఉన్నా.. తిలక్ వర్మ మాత్రం తన సత్తా చూపించాడు.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ శర్మ దృష్టిలో తిలక్ వర్మ పడడం కలిసి వచ్చింది. ఈ క్రమంలోని తాజాగా విండీస్ తో ప్రకటించిన 15 మంది ప్రాబబుల్స్ టీ 20 జట్టులో తిలక వర్మ స్థానం సంపాదించాడు. తాజాగా ఓ జాతీయా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ ” నేను టీమిండియాకు సెలక్ట్ అయ్యాననే వార్త చెప్ప గానే న తాళి దండ్రులు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. దులీప్ ట్రోఫీ ఆడుతుండడంతో రాత్రి వరకు నేను టీమిండియాకు ఎంపికయ్యాననే సంగతి నాకు తెలియదు. నా స్నేహితులు, ఆ తర్వాత నా తల్లి దండ్రులు ఫోన్ చేసి నాకు ఈ విషయాన్ని చెప్పారు. నా కోచ్ సలాం బయాష్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుతూ ” ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. మ్యాచ్ ఆడుతున్నంతసేపు ఇతర ఆలోచనలు లేకుండా ఆటపైనే దృష్టి పెట్టమని విండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ నుంచి నేర్చుకున్నా. ఆటలో ఎలాంటి తప్పులు జరిగినా ఆ బంతికే దానిని వదిలేయాలనై సూచించాడు. అతను చెప్పిన చిట్కా నాకు బాగా ఉపయోగపడింది. వైట్ బాల్ క్రికెట్ మానసిక దృక్పథానికి సంబంధించింది. కానీ రెడ్ బాల్ క్రికెట్లో సవాలు ఎదురవుతుంది. ప్రస్తుతం నా దృష్టాంతా దులీప్ ట్రోఫీ మీదే ఉంది. అని తిలక్ తెలియజేశాడు. మరి తిలక్ వర్మ టీమిండియాకు సెలక్ట్ అవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.