ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టుకు రెట్టించిన ఉత్సాహంతో రెడీ అవుతోంది. అయితే ఢిల్లీ టెస్టుకు ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో దక్కిన ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం మరింత ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఈ మ్యాచులోనూ నెగ్గాలని చూస్తోంది. అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది. టర్నింగ్ ట్రాక్‌గా చెప్పుకునే అరుణ్ జైట్లీ గ్రౌండ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను స్పిన్‌తో తిప్పేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టులో ఒక స్టార్ ప్లేయర్ ఆడటం లేదని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.
ఢిల్లీ టెస్టులో టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఆడటం లేదు. ఈ మ్యాచ్‌లో ఆడకుండా రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు అతడు వెళ్తున్నాడు. సౌరాష్ట్ర జట్టుకు సారథిగా ఉన్న ఉనాద్కట్.. ఇటీవల తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్రకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కొంత తడబడినా, బౌలింగ్‌లో మాత్రం జడ్డూ అదరగొట్టాడు. ఆ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌లో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్ కోసం జయదేవ్ ఉనాద్కట్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ ఫస్ట్ టెస్టులో అతడికి ఆడే అవకాశం మాత్రం రాలేదు.
ఢిల్లీలో జరిగే రెండో టెస్టులో పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను తయారు చేస్తారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో పేసర్ అవసరం భారత టీమ్‌కు రాకపోవచ్చు. ఒకవేళ మూడో స్పీడ్‌స్టర్ కావాలనుకుంటే ఎలాగూ ఉమేష్ యాదవ్ ఉండనే ఉన్నాడు. కాబట్టి ఉనాద్కట్‌ను బీసీసీఐ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. అతడు రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు వెళ్తున్నట్లు తెలిపింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తుదిపోరు జరగనుంది. మరి, రంజీ మ్యాచ్ కోసం ఉనాద్కట్‌ను బీసీసీఐ రిలీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEWS – Jaydev Unadkat released from India’s squad for 2nd Test to take part in the finals of the Ranji Trophy.
More details here – https://t.co/pndC6zTeKC #TeamIndia pic.twitter.com/8yPcvi1PQl
— BCCI (@BCCI) February 12, 2023