ఆస్ట్రేలియా వేదికగా ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఆసీస్‌కు పయనమయ్యారు. ప్రయాణానికి ముందు భారత బృందం ఫొటోలకు ఫోజులిచ్చింది. సూట్స్‌ల్లో ఆటగాళ్ల లుక్ అదిరిపోయింది. గ్రూప్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలను షేర్ చేస్తున్న క్రికెట్ అభిమానులు టీమిండియ్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. కాగా.. జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లే ఉన్నారు. స్టాండ్‌బై ప్లేయర్లను పక్కనపెట్టినా.. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఈ 15 మందిలో మిస్ అయింది బుమ్రా ఒక్కడే. వెన్నుముక గాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్ కప్ దూరమైన విషయం తెలిసిందే.
మరి బుమ్రా స్థానంలో ఇంకో పేసర్‌ను జట్టులోకి తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. మొహమ్మద్ షమీ లేదా మొహమ్మద్ సిరాజ్‌ను టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకుంటారనే గుసగుసలు వినిపించినా.. ఆస్ట్రేలియాకు వెళ్లిన జట్టులో వారిద్దరూ లేరు. మొహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాడు. కానీ.. షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నాడా? లేడా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ క్రమంలో బుమ్రా స్థానంలో మరో ఆటగాడు లేకుండానే టీమిండియా వరల్డ్ కప్ ఆడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దారుణమైన ఫేలవ బౌలింగ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్‌తోనే నెగ్గుకురావడం కష్టం.
కాగా.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రాణిస్తే.. సిరాజ్‌ను, ఇంకో వారంలో ఫిట్ అయితే షమీని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఇంకా ఉన్నట్లు సమాచారం. కాగా.. దీపక్ చాహర్‌ను కూడా ఒక ఆప్షన్‌లా భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ.. అతను, భువీ ఒకే విధమైన బౌలర్లు కావడం దీపక్‌కు మైనస్‌గా మారింది. షమీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కానీ.. సౌతాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడిన సిరాజ్ వికెట్లు పడగొట్టకున్నా.. డెత్ ఓవర్స్‌లో 17, 19వ ఓవర్లను బాగానే వేసి.. కెప్టెన్ రోహిత్ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తుంది. షమీ ఫిట్‌గా లేకుంటే.. సిరాజ్ వరల్డ్ కప్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. పైగా ఆస్ట్రేలియా పిచ్‌లపై సిరాజ్ డేంజరస్‌గా మారే ఛాన్స్ ఉంది. ఒక వేళ సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంటే.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత అతను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లి.. వరల్డ్ కప్ టీమ్‌తో కలుస్తాడు.
Picture perfect 📸
Let’s do this #TeamIndia@cricketworldcup, here we come ✈️ pic.twitter.com/XX7cSg3Qno
— BCCI (@BCCI) October 5, 2022
🇮🇳❤️ pic.twitter.com/Yf8yL9x2lD
— Arshdeep Singh (@arshdeepsinghh) October 6, 2022
Australia bound ✈️. Exciting times ahead. ✌️ @yuzi_chahal @HarshalPatel23 pic.twitter.com/KtmertwefU
— Virat Kohli (@imVkohli) October 6, 2022
Team India have left for Australia. pic.twitter.com/CBx1L9bSVU
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 6, 2022
Cannot wait for the upcoming challenge. 🇮🇳
𝗘𝘅𝗰𝗶𝘁𝗲𝗱. 𝗡𝗲𝗿𝘃𝗼𝘂𝘀. 𝗕𝘂𝘁 𝘀𝗼 𝘀𝗼 𝗺𝗼𝘁𝗶𝘃𝗮𝘁𝗲𝗱. 💪 pic.twitter.com/jps1DX1vXH— Surya Kumar Yadav (@surya_14kumar) October 5, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ పేరిట అత్యంత చెత్త రికార్డు! ప్రపంచంలోనే తొలి ప్లేయర్