ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ ఇండియా- పాక్ మధ్య జరిగింది ఆఖరి బంతి వరకు టీమిండియా ఓటమిని ఒప్పుకోలేదు. అలాగే నిలబడి పోరాడి గెలిచింది. 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా.. ఆఖరికి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. నిజానికి ఎవరూ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందని అనుకోలేదు. కానీ, కోహ్లీ మాత్రం మ్యాచ్ గెలిచి తీరాలని నిర్ణయించుకున్నాడు. అలాగే గెలిపించి చూపించాడు. హార్దిక్ పాండ్యాని తోడుగా పెట్టుకుని ప్రతి బంతిని బౌండిరీకి తరలిస్తూ ఉన్నాడు. టీమిండియా విజయం సాధించడంలో కోహ్లీ ఎంతో కీలకపాత్ర పోషించాడు. నిజానికి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.
విరాట్ కోహ్లీ ఆట చూసి అభిమానులే కాదు.. జట్టు సైతం ఆనందం పట్టలేక సంబరాలు చేసుకున్నారు. రోహిత్ శర్మ అయితే కోహ్లీ ఎత్తుకుని మైదానంలో గిరా గిరా తిప్పేశాడు. అందుకే కదా అతడిని కింగ్ అనేది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అతడిని ఛాంపియన్ అని ఊరికే పిలవరు అంటూ ఐసీసీనే ట్వీట్ చేసింది. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ అంతా సంబరపడిపోతున్నారు. మ్యాచ్ తర్వాత కోహ్లీ సైతం ఎంతో ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత మైదానంలో కింద కూర్చొని చెత్తే నేలను కొడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. నిజానికి కోహ్లీని ఇలా ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లను అతను ఒంటిచేత్తో గెలిపించాడు. కానీ, ఈ మ్యాచ్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు.
Virat Kohli. Chasing targets since ‘08. 😍🔥 pic.twitter.com/SB2iuNRxHk
— Rajasthan Royals (@rajasthanroyals) October 23, 2022
The moment Rohit Sharma lifted Virat Kohli – The Best moment of this match. pic.twitter.com/bg0Sq8ZKp5
— CricketMAN2 (@ImTanujSingh) October 23, 2022
The KING is back 👑
Take a bow, Virat Kohli 🙌#T20WorldCup | #INDvPAK pic.twitter.com/5aCOCF6JIS
— T20 World Cup (@T20WorldCup) October 23, 2022
హర్షా భోగ్లే మాట్లాడుతూ.. “నేను కోహ్లీ కొన్నేళ్లుగా చూస్తున్నాను. కానీ, మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ ఏడవడం నేను ఇదో మొదటిసారి చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ మ్యాచ్ తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చేటప్పుడు కూడా ఎంతో ఎమోషనల్ గా కనిపించాడు. టీమ్ సభ్యులు మొత్తం అతడిని ప్రశంసిస్తున్నా కూడా ఒక్కడే ఏదో ఆలోచిస్తూ అలా నడుస్తూ వెళ్లిపోయాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ “నాకు నిజంగా మాటలు రావడంలేదు. ఎన్నో మ్యాచ్‌లు ఇలాంటివి చూశాను. కానీ, ఎందుకో ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడంలేదు. హార్దిక్ నాతో చెప్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు నమ్ము.. చివరి వరకు నిలబడు. మనం సాధిస్తాం అంటూ చెప్తూ ఉన్నాడు” అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Just now for king 👑❤️@imVkohli#ViratKohli𓃵#INDvsPAK2022 pic.twitter.com/Bn19TMe88A
— Battini Mahesh (@BattiniMahesh1) October 23, 2022
There is only one King @imVkohli
What a match ….Well Played India 🇮🇳
HAPPY DIWALI INDEED 💥💥 pic.twitter.com/jBgdzvauv2— Kartik Aaryan (@TheAaryanKartik) October 23, 2022
82* (51) 👉 Mohali 2016
82* (53) 👉 Melbourne 2022Two knocks that epitomize the greatness of Virat Kohli 💫#INDvPAK | #T20WorldCup pic.twitter.com/nAt8Nz3Nyg
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2022
The hug between the Head Coach Rahul Dravid and Virat Kohli. pic.twitter.com/vc16MOqCwD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2022