టీమిండియా క్రికెటర్లలో క్రేజ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఒకప్పుడు సచిన్. ఆ తర్వాత ధోనీ. ఇప్పుడు మాత్రం విరాట్ కోహ్లీ. కొందరు ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇదే నిజం! మ్యచ్ లో బ్యాటింగ్ చేసే విషయం దగ్గర నుంచి డ్రస్సింగ్ స్టైల్ వరకు కోహ్లీని బీట్ చేయడం చాలా కష్టం. అందుకే మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ కోహ్లీకి వీరాభిమానులున్నారు. మన దాయాది దేశమైన పాక్ లో కోహ్లీని పిచ్చిగా ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారంటేనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఆసక్తికర సంఘటన జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అయితే మ్యాచ్, లేదంటే ప్రాక్టీసు తప్పించి పెద్దగా బయట తిరగట్లేదు. పూర్తిగా ఆటపైనే దృష్టి సారించాడు. అందుకు నిదర్శనంగా.. ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచ్ లు ఆడితే అందులు మూడింటిలో కోహ్లీ, హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 64 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీని కొందరు మహిళా అభిమానులు కలిశారు.
మెల్ బోర్న్ మహిళా హాకీ జట్టు అంతా కలిసి ఆడిలైడ్ లో కోహ్లీని కలిశారు. చాలాసేపు చర్చించడమే కాకుండా చివర్లో ఓ ఫొటో కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా చూస్తుంటే.. కోహ్లీ అబ్బాయిలతో పాటు అమ్మాయిల్లోనూ విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. అది మన దేశమైనా, ఆస్ట్రేలియా అయినా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ ల్లో మూడింట్లో గెలిచిన టీమిండియా.. దాదాపు సెమీస్ లోకి వెళ్లిపోయింది. ఇక ఆదివారం, జింబాబ్వేతో మ్యాచ్ లోనూ గెలిస్తే అఫిషీయల్ గా సెమీస్ లోకి ఎంటరవుతుంది.
Virat Kohli with HC Melbourne Women’s Hockey team in Adelaide. pic.twitter.com/akW2QFULX8
— Johns. (@CricCrazyJohns) November 3, 2022