నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా 13 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో అనూహ్యంగా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ కు ఒరిగిందేమీ లేకపోయినా ప్రోటీస్ జట్టు మాత్రం సెమీస్ కోల్పోయింది. దీంతో సౌతాఫ్రికా జట్టుపై, ఆ జట్టు సారధిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ప్రపంచ కప్ అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయిన ప్రొటీస్ జట్టుకు ఈసారైనా ఆ కల వేరుతుందా! అనుకుంటుండగా నిర్లక్యం వారిని కాటేసింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 159 పరుగులు చేసింది. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక సఫారీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేయగలిగారు. కట్టుదిట్టంగా బోలింగ్ చేసిన నెదర్లాండ్ బౌలర్లు.. క్రమంతప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో 13 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. సౌతాఫ్రికా బ్యాటార్లలో 25 పరుగులు చేసిన రిలీ రూసో టాప్ స్కోరర్ అంటే అర్థం వారి ఇన్నింగ్స్ ఎంత నిర్లక్ష్యంగా సాగిందో.
CAN YOU BELIEVE IT⁉
South Africa is going home… and it’s thanks to the NETHERLANDS 🤯🤯🤯
More >>> https://t.co/zzZkXbUdDS #T20WorldCup pic.twitter.com/zgBt3m2ZWr
— Fox Cricket (@FoxCricket) November 6, 2022
తాజాగా, సౌతాఫ్రికా ఓటమిని ఉద్దేశిస్తూ సచిన్ టెండూల్కర్ ట్రోల్ చేశాడు. నెదర్లాండ్స్ విజయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన సచిన్.. “ఇవాళ ఉదయం నా ఫ్రెండ్ తో బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాను. అతడితో మనం డచ్ కు వెళ్దాం అని చెప్పాను. దీంతో అతడు నా మాటలు విని వెంటనే ఉక్కిరిబిక్కిరయ్యాడు..” అని రాసుకొచ్చాడు. అంతేకాదు.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు కూడా సచిన్ తన ఇన్స్టా ఖాతాలో ఇలాంటి పోస్టే పెట్టాడు. “ఈరోజు ఉదయాన్ని నేను.. నా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నాను.. లేవగానే ఆరెంజ్ జ్యూస్ తాగాను.. దీనిని చూస్తుంటే ఇదే ‘ఫ్లేవర్ ఆఫ్ ది డే’గా ఉంది..” అని రాసుకొచ్చాడు. ఈ రెండు పోస్టులలో సచిన్ ఎక్కడా సౌతాఫ్రికా పేరు తీసుకురాకపోయినా.. ఇది వారిని ఉద్దేశిస్తూ ట్రోల్ చేసినట్లుగా నెటిజన్స్ ఆపాదిస్తున్నారు.
Went for breakfast with a friend. Told him we’ll go Dutch. He almost choked at the proposition!😋😋#SAvsNED pic.twitter.com/kDH1tN5nPJ
— Sachin Tendulkar (@sachin_rt) November 6, 2022