టీమిండియాలో బాగా అల్లరి చేసే క్రికెటర్ ఎవరు? అనగానే చాలామంది చెప్పే పేరు యుజ్వేంద్ర చాహల్. పంత్ కూడా అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడు గానీ చాహల్ అంతయితే కాదు. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన చాహల్.. మ్యాచ్ లాడే అవకాశం రాకపోవడంతో.. బెంచ్ కే పరిమితమయ్యాడు. ఆసీస్ లో ఉన్న పిచ్ లన్నీ పేస్, బౌన్స్ పిచ్ లు కావడంతో.. మనోడికి ఆడే ఛాన్స్ దక్కలేదు. ఇక బౌండరీ లైన్ దగ్గర ఐకానిక్ పోజులిస్తూ కెమెరా కంటపడుతున్న అతడు.. ఇప్పుడు మరో కొంటెపనిచేసి న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి టీ20 ప్రపంచకప్ ని టీమిండియా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. పాక్, నెదర్లాండ్స్ పై అద్భుత విజయాలు సాధించింది. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో చాహల్, వాటర్ బాయ్ గా బాటిల్స్ మోస్తూ కనిపించాడు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ ని ఆటపట్టించాడు. డ్రింక్స్ బ్రేక్ టైంలో ఓవైపు పంత్.. బ్యాటర్లతో మాట్లాడుతుండగా, చాహల్ మాత్రం అంపైర్ పురుషాంగంపై పంచ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. దీనిని గమనించిన పలువురు నెటిజన్స్.. మొత్తం తతంగాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అయితే బౌలింగ్ ఇవ్వకపోవడంతోనే.. అంపైర్ బాల్స్ తో చాహల్ ఆడుకుంటున్నాడని.. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్య కుమార్ మాత్రమే 68 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్.. యధావిధిగా త్వరగా ఔటైపోయాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశపరిచారు. మిగిలిన బ్యాటర్లందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఎంగిడి 4, పార్నెల్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసి సఫారీ జట్టు చాలా నిలకడగా ఆడింది. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. మార్క్రమ్ 52, మిల్లర్ 59 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదంతా పక్కనబెడితే చాహల్.. కొంటె చేష్టలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Yuzi Bhai ki Dunia Alag hai🫡#chahal #INDvsSA pic.twitter.com/9NCaGno3gb
— Tanay (@tanay_chawda1) October 30, 2022
Yuzi Chahal makes fun with the on field umpire 🤣😂#INDvSA #INDvsSA pic.twitter.com/fVfrHkJ1Hc
— Kohli Fans (@The81072245) October 30, 2022