ఆసియా కప్ ఓటమి తర్వాత పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లపై సిరీస్ గెలిచి ఫుల్ జోష్ లో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టింది. ఆ జోరును కొనసాగిస్తూ టీమిండియా దాయది దేశమైన పాకిస్థాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే భారత్ జట్టు కంటిన్యూస్ గా విజయాలు అయితే సాధిస్తుంది గానీ, ఓ సమస్య మాత్రం టీమిండియాను వెంటాడుతూనే ఉందని.. భారత మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అదేంటంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. గత కొంత కాలంగా అతడి ఫామ్ ఆందోళనకు గురిచేస్తోందని అభిప్రాయపడ్డాడు. దీనిపై ఫోకస్ పెట్టక పోతే టీమిండియా రాబోయే మ్యాచ్ ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొక తప్పదని గవాస్కర్ పేర్కొన్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా క్రికెట్ ప్రపంచంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అటు బ్యాట్స్ మెన్ గా, ఇటు సారథిగా టీమిండియాను ముందుండి నడిపిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. దాంతో భారత జట్టుకు రోహిత్ ఫామ్ పెద్ద ప్రమాదంగా మారబోతుందని హెచ్చరించాడు గవాస్కర్. ఈ క్రమంలోనే ఇండియా టుడే పత్రికతో గవాస్కర్ మాట్లాడుతూ..”ప్రస్తుతం టీమిండియా మంచి జోరులో ఉంది. కానీ జట్టులో ఉన్న ఏకైక సమస్యల్లా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రాకపోవడమే. గత కొన్ని రోజులుగా రోహిత్ తన స్థాయికి తగ్గ ఆట ఆడటం లేదు. రోహిత్ బాగా ఆడితే తర్వాత వచ్చే బ్యాటర్లపై అంతగా ఒత్తిడి ఉండదు. దాంతో వారు వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా జట్టు మంచి స్కోర్ చేసేందుకు అనుకూలం అవుతుంది. అయితే పవర్ ప్లేలో వికెట్ పోకుండా ఆడటమే ఇక్కడ కీలకం. స్లో బ్యాటింగ్ చేసినప్పటికీ క్రీజ్ లో కుదురుకుంటే.. తర్వాత పరుగులు రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే రోహిత్ గత 10 టీ20 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక అర్ద సెంచరీతో 242 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్దం అవుతుంది, రోహిత్ ఫామ్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని. ఇక టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నెక్ట్స్ మ్యాచ్ లో ఆడించకపోవడమే మంచిదని గవాస్కర్ అన్నాడు. ఎందుకంటే నెదర్లాండ్స్ తో మ్యాచ్ తర్వాత భారత్ సౌతాఫ్రికాను ఢీ కొనబోతుంది. దాంతో పాండ్యా లాంటి ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చినా పర్వాలేదు. దాంతో ఆటగాళ్లు కీలక మ్యాచ్ లకు ఫుల్ ఫిట్ నెస్ లోకి వస్తారని గవాస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. నా దృష్టిలో నెదర్లాండ్ తో మ్యాచ్ లో పాండ్యాను ఆడించకపోవడమే మంచిదని సునీల్ గవాస్కర్ అన్నాడు. అతడి స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఈ నేపథ్యంలోనే టీ20ల్లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరించాడు. షమీని గ్యారంటీగా ఆడించాలని సూచించాడు.
Last 10 innings score of rohit sharma. Y isnt this being questioned? pic.twitter.com/H4yg0bZ2ty
— Gitesh (@gitesh_palav) October 23, 2022