అతడు వరల్డ్ క్లాస్ బౌలర్. టీ20 వరల్డ్ కప్ ముందు అతడిపై చాలా అంచనాలు ఉండేవి. ఎందుకంటే మనోడు వేసే యార్కర్లకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎంతటి టాప్ క్లాస్ బ్యాటర్లు అయినా సరే తిప్పలు పడాల్సిందే. కానీ రియాలిటీలో జరుగుతున్నది వేరు. ఆడిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక బ్యాటింగ్ లోనూ పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్.. పాక్ బోర్డుపై ఒకటే కౌంటర్స్ వేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ జట్టులో షాహీన్ అఫ్రిది టాప్ క్లాస్ బౌలర్. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఓడిపోవడానికి కారణం కూడా ఇతడే. దీంతో ఈసారి కూడా అలాంటిది అద్భుతాలు చేస్తాడని పాక్ ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ భారత్, జింబాబ్వేతో మ్యాచుల్లో బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు. మన జట్టుతో జరిగిన మ్యాచ్ లో అఫ్రిది బౌలింగ్ ని క్లాస్ గా ఉతికారేశారు. ఇక జింబాబ్వేతో మ్యాచ్ లో అఫ్రిది బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ రన్స్ చేసే క్రమంలో కుంటుతూ కనిపించాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. ఇతడిని ప్రపంచకప్ కి సెలెక్ట్ చేసి, బోర్డు తప్పు చేసిందని మండిపడుతున్నాడు.
అసలు విషయానికొస్తే.. కొన్నాళ్ల ముందు షాహీన్ అఫ్రిదితో పాటు ఫకర్ జమాన్ కు గాయాలయ్యాయి. దీంతో అఫ్రిది మోకాలికి లండన్ లో సర్జరీ కూడా జరిగింది. ఇక దీని తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం అతడిని ఎంపిక చేశారు. అనుభవజ్ఞుడైన ఫకర్ జమాన్ ని మాత్రం ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఈ చర్చ నడుస్తూనే ఉంది. దీన్నిబట్టి చూస్తే ఇంకా గాయం నుంచి అఫ్రిది కోలుకోకపోవడం వల్ల అఫ్రిది.. తన పాత లయని అందుకోలేకపోతున్నాడు. బౌలింగ్ పరంగానే కాదు.. బ్యాటింగ్ అవకాశమొచ్చినా సరే రన్స్ చేయడానికి తంటాలు పడుతున్నాడు.
OMG! Just see Shaheen Afridi running???
Only fools cann’t see it!!! pic.twitter.com/XC9ryr382Z— Shakil Shaikh (@shakilsh58) October 28, 2022