షాహీన్ అఫ్రిదీ.. పాకిస్థాన్ బౌలింగ్ తురుపు ముక్కగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ లో లాహోర్ ఖలందర్ జట్టుకు సారథిగా ఉండి టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో పెషావర్ జట్టుపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా.. మంగళవారం పెషావర్ జల్మీ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో పెషావర్ టీమ్ 35 పరుగులతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఎప్పుడు బాల్ తో రాణించే షాహీన్ అఫ్రిదీ.. ఈ సారి తన బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు. ప్రత్యర్థి జట్టుపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో ఒకానొక దశలో లాహోర్ జట్టు విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ చివర్లో లాహోర్ బ్యాటర్లు తడబడటం వల్ల ఓడిపోయారు.
షాహీన్ అఫ్రిదీ.. పాకిస్థాన్ బౌలింగ్ తురుపు ముక్కగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ లో ఆడుతున్నాడు షాహీన్. లాహోర్ ఖలందర్ జట్టుకు సారథిగా ఉండి టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో పెషావర్ జట్టుపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జట్టు 19.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఓపెనర్లు ఆయుబ్(68), బాబార్(50), పరుగులతో రాణించారు. అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది లాహోర్ జట్టు. పెషావర్ బౌలర్ల ధాటికి 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో హుస్సేన్ తలాత్ తో జత కలిసిన కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తలాత్ సైతం ఫోర్లు, సిక్సర్లలో పెషావర్ బౌలర్లను బెంబేలెత్తించాడు. వీరి బ్యాటింగ్ చూస్తుంటే లాహోర్ గెలుపు ఖాయం అని అందరు అనుకున్నారు. అయితే వీరి జోడిని విడగొట్టాడు రియాజ్. 36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లలో మంచి ఊపు మీదున్న షాహీన్ ను అవుట్ చేశాడు. అనంతరం కొద్దిసేపటికే తలాత్ సైతం 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరాడు. దాంతో 19.4 ఓవర్లలో 172 పరుగులు చేసి 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది లాహోర్ జట్టు. అయితే ఎప్పుడు బాల్ తో రాణించే షాహీన్ అఫ్రిదీ.. ఈ మ్యాచ్ లో బ్యాట్ తో సత్తా చాటడం విశేషం. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను గెలుపుతీరాలదాక తీసుకొచ్చాడు షాహీన్. బౌలింగ్ లో సైతం 4 వికెట్లు తీసి సత్తా చాటాడు షాహీన్. మరి ఎప్పుడు బౌలింగ్ లో మెరిసే షాహీన్.. ఈసారి బ్యాటింగ్ లో దుమ్మురేపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Its as if Boom Boom Afridi came out to bat again! Oh wait…#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvLQ pic.twitter.com/SSxa7dwWDx
— PakistanSuperLeague (@thePSLt20) March 7, 2023
And it’s decided in the favour of @PeshawarZalmi who painted the field Yellow today 💛 #HBLPSL8 | #SabSitarayHumaray | #PZvLQ pic.twitter.com/K2c94D0QnI
— PakistanSuperLeague (@thePSLt20) March 7, 2023