టీ20 వరల్డ్ కప్ ఎంతో ఉత్కంఠగా జరుగుతోంది. సెమీస్ లో అడుగుపెట్టిన టీమిండియా,పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్.. ఇందులో గెలిచి ఫైనల్లో ఎలా అడుగుపెట్టాలా అనే ప్లాన్స్ వేసుకుంటున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన జట్లపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇలా మొత్తం అంతా సందడి సందడిగా ఉంది. ఫైనల్ కి వెళ్లేది ఎవరా అని రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. అయితే వీటన్నింటి మధ్యలో నవ్వు తెప్పించే వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో ఉన్నది టీమిండియా క్రికెటర్ అశ్విన్ కావడంతో.. ఆసక్తి ఇంకాస్త పెరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా, సూపర్-12 దశలో తన చివరి మ్యాచ్ ని జింబాబ్వేతో ఆడింది. మెల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మన జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ మన విజయానికి ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో.. కొందరు అతడు ఏం చెబుతున్నారో చూశారు. మరికొందరు మాత్రం వెనుక అశ్విన్ చేసిన పనిచూసి అవాక్కయ్యారు. ఆ వీడియోనే ఇప్పుడు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది.
టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు ఉంటాయి కాబట్టి గుర్తుపట్టడం సులభమే. కానీ పైన వేసుకునే కోటుపై మాత్రం నంబర్ గానీ, పేరు గానీ ఉండదు. కాబట్టి ఎవరిది ఏ కోటు అని గుర్తుపట్టడం కాస్త కష్టం. దీని కోసం అశ్విన్ కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. ఇప్పుడదే వీడియోలో రికార్డ్ అయింది. రోహిత్ మాట్లాడుతున్న టైంలో వెనక వైపు ఓ చోట నిల్చుని ఉన్న అశ్విన్.. తన కోటు ఏదో గుర్తుపట్టేందుకు వాసన చూశాడు. తన కోటు అని తెలిసి దాన్ని తీసుకుపోయాడు. మరో దాన్ని అక్కడే కింద పడేశాడు. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అశ్విన్ మైదానంలోనే కాదు నార్మల్ విషయాల్లోనూ టెక్నిక్స్ పక్కా యూజ్ చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్.. సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. 10వ తేదీని ఈ మ్యాచ్ జరగనుంది.
Ashwin Anna Supremacy
This is the right way to find your clothes pic.twitter.com/a9YSakerU4
— chintubaba (@chintamani0d) November 7, 2022