టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశ మ్యాచులు ఆదివారం (అక్టోబర్ 6)తో ముగియనున్నాయి. ఇందులో భాగంగా నేడు పాకిస్తాన్- బంగ్లాదేశ్ జట్ల కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో.. వారు నేరుగా సెమీస్ కు అర్హత సాధించవచ్చు. అలాంటి కీలక మ్యాచులో అంపైర్, 3rd అంపైర్ కలిసి తీసుకున్న ఒక తప్పిదం బంగ్లాదేశ్ ను టోర్నీకి దూరం చేసేలా ఉంది. బంగ్లా సారధి షకిబుల్ హసన్ ఎదుర్కొన్న బంతి క్లియర్ గా బ్యాట్ తాకినట్లుగా కనిపిస్తున్నప్పటికీ అంపైర్లు ఔట్ గా ప్రకటించారు. దీంతో అంపైర్లు పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించారంటూ వార్తలొస్తున్నాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి పరుగులు చేసింది. అనంతరం 11వ ఓవర్ 4 బంతికి షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో సౌమ్యా సర్కార్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షకిబుల్ హసన్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక్కడే అసలు వివాదం రాసుకుంది. షకీబ్ ఎదర్కొన్న బంతి బ్యాట్ తాకినట్లుగా కనిపిస్తున్నప్పటికీ అంపైర్ అవుట్ ఇచ్చాడు. వెంటనే షకీబ్ DRS కోరినప్పటికీ అతడికి న్యాయం జరగలేదు. మూడు.. నాలుగు సార్లు అన్ని రకాలుగా చెక్ చేసిన థర్డ్ అంపైర్, ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఔట్ గా ప్రకటించాడు. ఈ తతంగమంతా మైదానంలోని స్క్రీన్ పై కనిపించడంతో ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#CricketTwitter, was that out or not-out?
Another controversial DRS decision in the #T20WorldCup.#ShakibAlHasan #PakvsBAN pic.twitter.com/oiSZkpBHvN
— Broken Cricket Dreams Cricket Blog (@cricket_broken) November 6, 2022
Pakistan Always a Cheap and Cheater Country#Cheating @Sah75official pic.twitter.com/FailbFA3B3
— R.Gautam🇳🇵 (@MaxxGautam18) November 6, 2022
ఇక బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ నజ్మల్ హసన్ శాంతో 54 పరుగులు చేయగా లిటన్ దాస్ 10 పరుగులు, సౌమ్య సర్కార్ 20, ఆసీఫ్ హుస్సేన్ 24 పరుగులు చేయగా మిగతా బ్యాట్‌మెన్స్ రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు, హారీష్ రవుఫ్, ఇఫ్తికర్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.
That was really dumb umpiring #ShakibAlHasan
— ansHU MOR (@anshuMor) November 6, 2022