ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022ను సాధించడమే లక్ష్యంగా టీమిండియా కంగారుల గడ్డపై అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభానికి రెండు వారాల ముందుగానే ఆసీస్ చేరుకున్న భారత జట్టు పెర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడింది. ఇక టీ20 వరల్డ్ కప్‌లో అధికారికంగా ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో పాటు.. మొహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్‌తో మరో వామప్ మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అసలు సిసలైన వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది.
ఇప్పటికే వరల్డ్ కప్ హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా టీమిండియా పేరు వినిపిస్తోంది. భారత దిగ్గజ మాజీ క్రికెటర్లు వరల్డ్ కప్‌లో సత్తా చాటి సెమీ ఫైనల్, ఫైనల్ ఆడే జట్లను ముందే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు వరల్డ్ కప్ సెమీస్‌కు చేరుతాయని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక మరో దిగ్గజ మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడే జట్లు ఇవే అంటూ తేల్చేశాడు. ఆస్ట్రేలియాను భారత్ ఫైనల్లో ఢీకొనడం ఖాయమని అన్నారు. కానీ.. వీరిద్దరీ అంచనాలకు భిన్నంగా మరో దిగ్గజ క్రికెటర్, 1983లో భారత్‌కు తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు.
టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. ‘వరల్డ్ కప్‌లో టీమిండియా విన్నింగ్స్ ఛాన్సెస్ గురించి చెప్పడం కష్టమే. అసలు విషయం ఏమిటంటే.. ఇంతకు టీమిండియా కనీసం టాప్ ఫోర్‌లో అయినా ఉంటుందా? లేదా? అనేదే పెద్ద సమస్య. టీమిండియాకు సెమీస్ ఆడే అవకావం 30 శాతం మాత్రమే ఉందని నేను భావిస్తున్నాను’ అని కపిల్ అన్నారు. ప్రపంచం మొత్తం ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా టాప్ 3 టీమ్స్‌లో ఒకటిగా భావిస్తుంటే.. కపిల్ పాజీ మాత్రం టీమిండియా పరువు తీసేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిజానికి టీమిండియా బౌలింగ్ ఎటాక్ కొంత బలహీనంగా ఉంది. గాయంతో బుమ్రా దూరం కావడంతో ఆ సమస్య మరింత తీవ్రమైంది. కానీ.. షమీ ఆసీస్‌పై వామప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి మంచి ప్రదర్శన ఇచ్చినా.. అతనొక్కడి పైనే ఆధారపడలేం అంటూ క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Kapil Dev is not confident about India winning the T20 World Cup 🤯🇮🇳#t20 #t20worldcup #teamindia #cricket pic.twitter.com/5HjtA9mICR
— Sportskeeda (@Sportskeeda) October 19, 2022