కొన్నేళ్లుగా అన్ని విభాగాల్లో మంచి స్టాండెడ్స్‌ను సెట్ చేసిన టీమిండియా.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చెత్త ఫీల్డింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా.. పెర్త్‌లో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ఫీల్డింగ్ ఒత్తిడికి చిత్తు అయ్యే అలవాటు ఉన్న సౌతాఫ్రికాకు సైతం థ్రిల్లింగ్ విక్టరీని అందించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు మరోసారి ఓపెనర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మంచి స్టార్ట్‌ను అందించలేకపోయారు. కేఎల్ రాహుల్ తన చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. తొలి ఓవర్‌లో ఒక్క పరుగులు కూడా చేయకపోవడం.. తొలి తొమ్మిది బంతులు కూడా డాట్ చేయడంతో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌పై ఒత్తిడి పెంచింది.
పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలనే ఒత్తిడి పెరగడంతో రోహిత్ శర్మ 14 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్ కొట్టి 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే భయపడుతూ ఆడుతున్న కేఎల్ రాహుల్ సైతం.. 14 బంతులాడి 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండు మంచి బౌండరీలతో ఫామ్ కొనసాగించేలా కనిపించిన కోహ్లీ సైతం 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు స్వల్ప స్కోర్ చేసింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. సూర్య తప్ప మిగతా బ్యాటర్లు ఓపికతో బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇక దీపక్ హుడా, దినేష్ కార్తీన్ దారుణంగా విఫలం అయ్యారు.
రోహిత్, కోహ్లీ చెత్త ఫీల్డింగ్..
స్కోర్ తక్కువగానే ఉన్నా.. బౌలింగ్‌తో సౌతాఫ్రికా కట్టడి చేయవచ్చనే నమ్మకంతో ఫీల్డింగ్‌కు దిగిన టీమిండియా అర్షదీప్‌సింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఫామ్‌లో క్వింటన్ డికాక్(1), రోలి రోసోవ్(0)లను అవుట్ చేసి.. సౌతాఫ్రికాను చావు దెబ్బ కొట్టాడు. పవర్ ప్లే చివరి ఓవర్‌లో షమీ ప్రొటీస్ కెప్టెన్ బవుమా(10) సైతం అవుట్ చేయడంతో సౌతాఫ్రికా 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్ 40 పరుగులే. 134 పరుగుల లక్ష్యం కూడా ఆ సమయంలో కొండలా కనిపించింది. ఇలా నిదానంగా ఒత్తిడిలోకి వెళ్తున్న సౌతాఫ్రికా బ్యాటర్లు.. మార్కరమ్, డేవిడ్ మిల్లర్ టీమిండియాకు అవుట్ చేసుకోండి అంటూ ఛాన్స్‌లు ఇచ్చారు.
పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ 5వ బంతికి కవర్స్‌లోకి కొట్టిన మిల్లర్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ.. మళ్లీ మార్కరమ్‌ను వెనక్కి వెళ్లమని చెప్పాడు. కానీ అప్పటికే మార్కరమ్ సగం క్రీజ్‌లోకి వచ్చాడు. బంతి రోహిత్ చేతుల్లో పడింది. త్రో కొట్టడంలో రోహిత్ విఫలం అవ్వడంతో మార్కరమ్ బతికిపోయాడు. అప్పటికీ మార్కరమ్ 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ 5వ బంతిని మార్కరమ్ మిడ్ వికెట్ మీదుగా పుల్ షాట్ ఆడాడు. అది మిస్ టైమ్ అవ్వడంతో నేరుగా విరాట్ కోహ్లీ చేతుల్లోకి లడ్డులా వెళ్లింది. సాధారణంగా అద్భుతమైన ఫీల్డర్ అయిన కోహ్లీ ఆ క్యాచ్ నేలపాలు చేయడంతో రెండో సారి మార్కరమ్‌కు లైఫ్ వచ్చింది.
అలాగే.. షమీ వేసిన 12వ ఓవర్ 5వ బంతికి మిల్లర్ కవర్స్‌లోకి కొట్టాడు. మళ్లీ బంతి రోహిత్ చేతుల్లోకి వెళ్లింది. ఈ సారి అండర్ ఆమ్స్ త్రో కొట్టిన రోహిత్ మరోసారి రనౌట్‌ను మిస్ చేశాడు. త్రో కొట్టకుండా అలానే పరిగెత్తుకుంటూ వెళ్లి వికెట్లను కొట్టిన ఉన్న మిల్లర్ అవుట్ అయ్యేవాడు. కానీ.. రోహిత్ చెత్త ఫీల్డింగ్ పుణ్యామని సౌతాఫ్రికాకు మరో లైఫ్ వచ్చింది. ఇద్దరు నిలకడగా ఆడుతున్న బ్యాటర్లను అవుట్ చేసే గోల్డెన్ అవకాశాలు వచ్చినా.. టీమిండియా టాప్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ జారవిడువడంతో.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివర్లో ఒత్తిడిని తట్టుకోలే చిత్తుగా ఓడే సౌతాఫ్రికా రోహిత్, కోహ్లీ ఇచ్చిన లైఫ్‌లతోనే ఈ మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెలిచింది.
Rohit missed a run-out, sadly not happening for India.#ViratKohli & #RohitSharma𓃵 🥺#VideoViral pic.twitter.com/vB9aZXUoqG
— Priyanshu Rout (@priyanshurout54) October 30, 2022
Rohit missed easy Run-out, due to fat tummy he couldn’t, it will cost the match❎ Can’t run, can’t field, can’t make runs 🥊 Why in the team ??@BCCI
.
.
.#ViratKohli𓃵 #T20WorldCup #INDvsSA @T20WorldCup pic.twitter.com/CBkbUscu3a— Dravid sadgir (@DravidSadgir) October 30, 2022
35 ki score pe catch drop kiya….aur 35 ki score pe Rohit run out miss kiya. pic.twitter.com/tUKgZLcn8b
— 🇮🇳 Neel kamal ࿗ (@kam53540371) October 30, 2022
So India lost deliberately is the most lame excuse,they tried their best & despite early blows, they put up a great fight. Don’t believe this game was fixed. And people are claiming why Kohli dropped a catch & Rohit miss run out? It’s part of the game mates! #INDvsSA #T20WorldCup pic.twitter.com/bM7HvvKgD5
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) October 30, 2022