ఇది కదా మ్యాచ్ అంటే.. ఇది కదా అసలు సిసలైన వరల్డ్ కప్ అంటే.. ఇది కదా టీ20 మ్యాచ్ మజా అంటే. దాయాదుల పోరులో నరాలు తెగే ఉత్కంఠపోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠను కొనసాగిస్తూనే వచ్చింది. ప్రతి ఒక్క అభిమాని టీవీల ముందు కుర్చీల అంచున కూర్చొని భారత్ విన్నింగ్ మూమెంట్ ని ఆశ్వాదించారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థాయి నుంచి మ్యాచ్ గెలిచే దాకా వచ్చింది. టీమిండియా చూపించిన పోరాట పటిమకు యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. ముఖ్యంగా కోహ్లీ పాక్ బౌలర్లకు అడ్డుగా నిలబడి పడుతున్న వికెట్లను ఆపుతూ మ్యాచ్‌ని విజయ తీరాలు చేర్చాడు.
ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షో చేశాడు. పరుగుల యంత్రం అని విరాట్‌ని ఊరికే అనం కదా. ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాల తర్వాత భారత్‌కు ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌లో వింటేజ్ కోహ్లీని పరిచయం చేశాడు. తనలో ఇంకా సత్తా అంతే ఉందని నిరూపించాడు. కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లతో చెలరేగి ఆడాడు. కోహ్లీ మొదట ఎంతో చిన్నగా ఆటను స్టార్ చేశాడు. పడుతున్న వికెట్లను ఆపేందుకు పాండ్యాతో కలిసి భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ని గెలిపించి చూపించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీ.. కింగ్ కోహ్లీ మాత్రమే.
The KING is back 👑
Take a bow, Virat Kohli 🙌#T20WorldCup | #INDvPAK pic.twitter.com/OdAnbmso0h
— ICC (@ICC) October 23, 2022
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ పాక్‌ని కట్టడి చేయడంలో సఫలీకృతమైంది. చివర్లో మాత్రం కాస్త పట్టుతప్పడంతో పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి వచ్చిన టీమిండియా మొదటి నుంచి తడబడుతూ వచ్చింది. కేఎల్ రాహుల్(4), రోహిత్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(15), అక్షర్ పటేల్(2) ఆ తర్వాత చాలాసేపు వికెట్ పడకుండా విరాట్ కోహ్లీ, హార్దిక్ మ్యాచ్ ఆడుతూ వచ్చారు. ఆఖరి ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా ఔట్ కావడంతో డీకే క్రీజ్ లోకి వచ్చాడు. కానీ, డీకే కూడా రాణించలేకపోయాడు. కోహ్లీ చివరి వరకు నిలబడి మ్యాచ్‌ని విజయ తీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఒక బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా.. అశ్విన్ వచ్చి ఆ సింగిల్ తీసి టీమిండియాకి విజయాన్ని అందించాడు.
What a game of cricket! 👊🏻
India win a humdinger at the MCG 🤩 #T20WorldCup | #INDvPAK | https://t.co/H9EE5QNfGD pic.twitter.com/kbgItlGRhE
— ICC (@ICC) October 23, 2022
Etched in history 📸#T20WorldCup #INDvPAK pic.twitter.com/CDXZSfaxLz
— T20 World Cup (@T20WorldCup) October 23, 2022