టీమిండియా.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు గురించే చర్చ. ఎందుకంటే పడిలేచిన కెరటం అనే మాటలు వినే ఉంటారు. కానీ, ఉత్కంఠ మ్యాచ్‌లో పడిలేచిన కెరటంలా టీమిండియా పోరాడిన తీరు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. 10 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేసిన స్థితి నుంచి తర్వాతి పది ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి.. 115 పరుగులు చేసింది. ముఖ్యంగా కోహ్లీ పోరాడిన తీరు, అతను ఆడిన తీరు, టీమిండియాకి విజయం కట్టబెట్టిన తీరు చూసి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోసారి వింటేజ్ కోహ్లీని చూపించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కదా కోహ్లీ అంటే అంటూ నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు.
అయితే విరాట్ కోహ్లీ ఆట చూసి క్రికెట్ అభిమానులే కాదు.. జట్టు సభ్యులు సైతం చిన్నపిల్లల్లా మారిపోయారు. కోహ్లీ కొట్టే ప్రతి షాట్‌ని బౌండరీ బయట ఉండి ఎంజాయ్ చేశారు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నంతసేపు హార్దిక్ పాండ్యా కోహ్లీ ఆటని ఎంతో ఎంజాయ్ చేశాడు. మ్యాత్ తర్వాత రోహిత్ శర్మ.. చేసిన సందడి అంతా ఇంతా కాదు. మైదానాంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని అమాంతం గాల్లోకి ఎత్తేశాడు. దించకుండా.. మైదాననంలోనే గుడ్రంగా తిప్పుతూ తన ఆనందాన్ని, అభిమానాన్ని వ్యక్త పరిచాడు. రోహిత్ శర్మ అలా చేయడం చూసి కోహ్లీ కూడా ఆశ్చర్యపోయాడు. దింపిన తర్వాత రోహిత్‌ని హత్తుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Picture of the Day: Rohit Sharma taking Virat Kohli in his shoulders. pic.twitter.com/XU66FTvM9b
— Johns. (@CricCrazyJohns) October 23, 2022
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పాక్ బ్యాటర్లని బాగానే కట్టడి చేసింది. కానీ, వాళ్లు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగారు. బ్యాటింగ్ వచ్చిన టీమిండియా తొలి ఓవర్ నుంచి చాలా ఇబ్బంది పడింది. రాహుల్, రోహిత్ శర్మ వికెట్ల తర్వాత.. సూర్య కుమార్ యాదవ్ వచ్చి కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ, కాసేపటికే పెవిలియన్ చేరాడు. తర్వాత కూడా వికెట్లు ఆగలేదు. కానీ, హార్దిక్ పాండ్యాతో కలిసి విరాట్ కోహ్లీ.. మ్యాచ్‌పై చివరి ఓవర్ వరకు ఆశలను సజీవంగా ఉండేలా చేశాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ సంబరాలు చూసిన తర్వాత గతంలో వారి మధ్య ఉన్న గొడవలు అనేవి కూడా ఉత్త పుకార్లే అంటూ చెబుతున్నారు.
The moment Rohit Sharma lifted Virat Kohli – The Best moment of this match. pic.twitter.com/bg0Sq8ZKp5
— CricketMAN2 (@ImTanujSingh) October 23, 2022
Rohit Sharma lifted Virat Kohli – amazing picture! pic.twitter.com/sqZ1StFaQQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2022
Moment of The Match 😍#T20WorldCup #INDvPAK #INDvsPAK #ViratKohli #RohitSharma pic.twitter.com/38Qg5589ls
— RVCJ Media (@RVCJ_FB) October 23, 2022
Same Rohit same! 🥹🥹#INDvPAK #ViratKohli @imVkohli @ImRo45 @hardikpandya7 pic.twitter.com/e9FuNguCAs
— Punjab Kings (@PunjabKingsIPL) October 23, 2022