టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆడటం ఏమో గానీ మొదటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. ఇది మానసికంగా జట్టుపై జరుగుతున్న కుట్రలా అనిపిస్తోంది. లేకపోతే ఏంటి.. పాక్, నెదర్లాండ్స్ పై గెలిచిన భారత జట్టు.. ఆదివారం మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. పెర్త్ లో ఈ మ్యాచ్ లో జరిగింది. ఇది ముగించుకుని ప్రస్తుతం ఆడిలైడ్ లో ల్యాండ్ అయింది. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే.. తన రూంకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాన్స్ చాలామంది ఈ వీడియోని షేర్ చేశారు. అలా ఇది కోహ్లీ వరకు వెళ్లడంతో ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత జట్టు ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచులు బాగానే ఆడినప్పటికీ తాజా మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. అయినా సరే టీమిండియాకు వచ్చిన నష్టం ఏం లేదు. మిగతా రెండు మ్యాచ్ ల్లోనూ జింబాబ్వే, బంగ్లాదేశ్ పై గెలిచి సక్సెస్ ట్రాక్ లోకి వస్తుంది. ఇదంతా పక్కనబెడితే కోహ్లీ హోటల్ రూంకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో కోహ్లీ మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అదే విషయాన్ని ఇన్ స్టాలోనూ చెబుతూ.. ఇలా ప్రైవసీని భంగం కలిగించేలా, మూర్ఖంగా ప్రవర్తించకండి అంటూ సీరియస్ అయ్యాడు.
ఇక భర్త కోహ్లీకి అండగా అనుష్క శర్మ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇలానే ఉంటే బెడ్రూంలోకి కూడా వచ్చేశారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ మొత్తం వీడియోకి కారణమైన వ్యక్తిని.. క్రౌన్ రిసార్ట్స్ సంస్థ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఇలా అసౌకర్యానికి గురవడం ఇదేం కొత్తం కాదు. వార్మప్ మ్యాచ్ ల సందర్భంగా ప్రాక్టీస్ చేసి వెళ్తే.. చల్లని ఫుడ్ పెట్టారు. ఈ విషయమై బీసీసీఐ, ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మరవక ముందే.. కోహ్లీ రూం వీడియో బయటకు రావడం అనుమానాలు రేకెత్తిస్తోంది.