టీ20ల్లో సూపర్ ఫామ్ ను కొనసాగించిన సూర్య ఇటు వన్డేల్లో, అటు టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20ల్లో చూపించిన పవర్ ను అటు టెస్టులో, ఇటు వన్డేల్లో చూపించలేకపోతున్నాడు ఈ టీమిండియా 360 ప్లేయర్. వన్డేల్లో వరుసగా డకౌట్స్ అవుతూ.. అభిమానుల చేతిలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు సూర్యకుమార్.
గత కొంతకాలంగా టీమిండియా వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. క్రికెట్ ప్రపంచంలో దుసుకెళ్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఆడిన అన్ని సిరీస్ లు గెలుచుకుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆసీస్ పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లల్లో ముఖ్యంగా టీ20ల్లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు సూర్యకుమార్ యాదవ్. దాంతో టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఫామ్ తో ఇటు వన్డేల్లో, అటు టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ 360 ప్లేయర్. అయితే టీ20ల్లో చూపించిన పవర్ ను అటు టెస్టులో, ఇటు వన్డేల్లో చూపించలేకపోతున్నాడు టీమిండియా 360 ప్లేయర్. వన్డేల్లో వరుసగా డకౌట్స్ అవుతూ.. అభిమానుల చేతిలో దారుణమైన ట్రోల్స్ ఎదురుకుంటున్నాడు సూర్యకుమార్.
సూర్య కుమార్ యాదవ్.. టీ20ల్లో తిరుగులేని బ్యాటర్. వరల్డ్ నంబర్ 1 ప్లేయర్. కానీ వన్డేల్లోకి వచ్చే సరికి సీన్ మెుత్తం రివర్స్ అయ్యింది. టీ20ల్లో బౌలర్లకు చుక్కలు చూపించే ఈ ఇండియన్ ఏబీడీ.. వన్డేల్లోకి వచ్చేసరికి దారుణంగా విఫలం అవుతున్నాడు. ఆసీస్ తోజరిగిన తొలి రెండు వన్డేల్లో డకౌట్స్ అయ్యి గోల్డెన్ డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక సూర్య లాస్ట్ 10 వన్డే ఇన్నింగ్స్ లను చూసుకుంటే.. అతడు ఎంతలా విఫలం అవుతున్నాడో అర్ధం అవుతుంది. చివరిగా సూర్య ఆడిన 10 మ్యాచ్ ల స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి. 31, 6, 34*, 4, 8, 9, 13, 16, 0, 0 ఇక ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అర్ధశతకం కూడా లేకపోవడం గమనార్హం. టీ20ల్లో సూపర్ ఫామ్ ను కొనసాగించిన సూర్య వన్డేల్లోకి వచ్చే సరికి ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నాడు. వరల్డ్ కప్ కు కొద్దిరోజులే ఉన్నందున సూర్య ఫామ్ భారత్ కు అడ్డంకిగా మారుతుందని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సూర్య స్థానంలో స్టార్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి 117 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. 5 వికెట్లతో స్టార్క్ భారత పతనాన్ని శాసించాడు. ఇక 118 పరుగుల స్వల్ప పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్స్ భారత బౌలర్లను చీల్చి చెండాడారు. వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఆసీస్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్ (51*), మిచెల్ మార్ష్ (66*) పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. దాంతో మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక సూర్య వన్డేల్లో చూపిస్తున్న ఫామ్ భారత్ కు పెద్ద అడ్డంకిగా మారబోతోంది. దాంతో సూర్య ఫామ్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. మరి సూర్య ఫామ్ పై, సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలన్న సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Suryakumar Yadav in ODIs#INDvAUS pic.twitter.com/002bGrYUGx
— RVCJ Media (@RVCJ_FB) March 19, 2023
Suryakumar Yadav in his last 11 ODI innings:
14
31
4
6
34*
4
8
9
13
16
0
0No minnows no party for Hongurya Most overrated batsman Currently. pic.twitter.com/4m52l0fCRV
— S H A H I D. (@Irfy_Pathan56) March 19, 2023