టీమిండియా క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పొట్టి క్రికెట్ సమరం రాబోతోంది. జూన్ 9 నుంచి సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ సిరీస్ లో రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా, మహ్మద్ షమీలాంటి సీనియర్లు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పై సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి.
కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా అద్భుతంగా పర్ఫార్మ్ చేయగలదని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘కేఎల్ రాహుల్ టీమిండియాని అద్భుతంగా నడిపించగలడు. అతను జట్టులో ప్రశాంతత తీసుకురాగలడు. ఇటీవల అతని కెప్టెన్సీ చూస్తే మనకు అది కచ్చితంగా అర్థమవుతుంది. టీమిండియాలో ఇప్పుడున్న యువ ఆటగాళ్లకు అతని సారథ్యమే సరైంది.’
The @Paytm #INDvSA T20I series begins on 9th June. 👌 👌
Excitement levels 🆙! 👏 👏
Take a look at the fixtures 🔽 pic.twitter.com/0VZQfdnT84
— BCCI (@BCCI) June 7, 2022
‘ధినేష్ కార్తీక్, పంత్ లాంటి హిట్టర్లు ఉన్నారు.. కుల్దీప్, చాహల్ లాంటి సీనియర్ స్పిన్నర్లు ఉన్నారు.. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ లాంటి యువ పేసర్లు ఉన్నారు. ఇలాంటి జట్టుతో టీమిండియా ఎంతో అద్భుతంగా రాణించగలదు. మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్ల బలాబలాలు చూస్తే.. ఈ సిరీస్ ఎంతో ఆసక్తిగా మారనుంది’ అంటూ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు.
First practice session ✅
Snapshots from #TeamIndia‘s training at the Arun Jaitley Stadium, Delhi. 👍 👍 #INDvSA | @Paytm pic.twitter.com/6v0Ik5nydJ
— BCCI (@BCCI) June 6, 2022
రైనా వ్యాఖ్యలు చూస్తుంటే.. రోహిత్ శర్మ సారథ్యానికి ఎసరు పెట్టేలాగే ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ కెప్టెన్సీ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2022 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టును తొలి సీజన్లోనే ప్లే ఆఫ్స్ కు చేర్చిన ఘనత రాహుల్ సొంతం. కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే మాజీలు, క్రికెట్ నిపుణులు కేఎల్ రాహుల్ కు మంచి మార్కులే వేశారు. మరి, సురేశ్ రైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
” K L Rahul has looked very calm and composed as a Captain in recent times and the players selected need a leader like him. I feel his presence will bring calmness. ”
– Suresh Raina(On Star Sports)@klrahul • #CaptainKL pic.twitter.com/fpo3i75dBH
— Juman (@cool_rahulfan) June 6, 2022