ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది. వన్డే వరల్డ్ కప్ వేటలో భాగంగా కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని జోరు మీదుంది. ఇక ఇదే జోరును న్యూజిలాండ్ వన్డే సిరీస్ లోనూ చూపించాలని భావిస్తోంది. అయితే గత కొంత కాలంగా క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశం టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ ను ఎందుకు ఎంపిక చేయట్లేదని. తాజాగా శ్రీలంకతో జరిగిన, మరికొన్ని రోజుల్లో కివీస్ తో జరిగే టీ20 సిరీస్ లకు రోహిత్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయలేదు. వారిని విశ్రాంతి పేరుతో పక్కకు పెడుతోంది బీసీసీఐ. అయితే అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ ను భవిష్యత్ లో టీ20ల్లో చూడలేమా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై స్పందించాడు టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. వీరిద్దరిని ఎందుకు టీ20ల్లో ఎంపిక చేయట్లేదో తేల్చి చెప్పాడు.
గతేడాది టీ20 ప్రపంచ కప్ ముగిసినప్పటి నుంచి టీ20లకు రెగ్యూలర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని టీ20లకు ఎంపిక చేయకుండా పక్కన పెడుతున్నారు. అదీకాక వారిని ఎందుకు పక్కన పెడుతున్నారో సమాధానం చెప్పకుండా BCCI మౌనం వహిస్తోంది. దాంతో తమ అభిమాన ఆటగాళ్లు ఇక భవిష్యత్ లో టీ20ల్లో కనిపించరా? అన్న అనుమానం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వారి టీ20 భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్. ప్రస్తుతం ఉన్న సెలెక్షన్ కమిటీ వచ్చే సంవత్సరం(2024)లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటి నుంచే టీమ్ ను సన్నద్ధం చేస్తోంది.
అందులో భాగంగానే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తుందని గవాస్కర్ తెలిపాడు. అలా అని రోహిత్, విరాట్ లను టీ20ల్లోకి తీసుకోరని కాదు.. కీలకమైన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం వారికి సెలెక్టర్లు విశ్రాంతిని ఇస్తున్నారని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక రోహిత్, విరాట్ కోహ్లీలు ఇదే ఫామ్ ను కొనసాగిస్తే.. తప్పకుండా వారు టీ20ల్లో కొనసాగుతారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇలాంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తేనే శక్తి పుంజుకుని బరిలోకి దిగుతారని, ఇది టీమిండియాకు ఎంతో మేలు చేస్తుంది అని సునీల్ గవాస్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మరి సునీల్ గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar: Are Rohit Sharma and Virat Kohli’s T20 careers over? Gavaskar gave this answer https://t.co/bLqsBUG1ON
— HMM NEWS (@hmmnews1) January 17, 2023