రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం శ్రీలంక టీమ్ బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. అయితే బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఛాతినొప్పితో శ్రీలంక స్టార్ ప్లేయర్ మ్యాచ్ మధ్యలో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక కీపర్, బ్యాటర్ కుశాల్ మెండిస్ కు టెస్టు మధ్యలో ఛాతి నొప్పి వచ్చింది. మొదట సాధారణంగానే తీసుకున్న మెండిస్.. ఆటలో కొనసాగాడు. ఆ తర్వాత ఛాతినొప్పి తీవ్రతరం కావడంతో తట్టుకోలేక ఫిజియోని పిలిచాడు. మైదానంలో కుశాల్ మెండిస్ పరిస్థితిని పరిశీలించిన ఆ జట్టు ఫిజియో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సిరీస్ విషయానికి వస్తే.. శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మే 23న రెండో టెస్టు మొదలవ్వగా.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటిరోజు ఓపెనర్లు హసన్ జోయ్, తమీమ్ ఇక్బాల్ డకౌట్ గా పెవిలియన్ చేరారు. లిటాన్ దాస్ 211 బంతుల్లో 128 పరుగులతో అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముస్తాఫిఖుర్ రహీమ్ 243 బంతుల్లో 112 పరుగులతో క్రీజులో ఆట కొనసాగిస్తున్నాడు. 82 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తోంది. కుశాల్ మెండిస్ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sri Lanka Cricketer Kusal Mendis Complains of Chest Pain, Rushed to Hospital – News18 https://t.co/3HhAXGkzhX pic.twitter.com/iaqZgEPtY9
— DailyNews 🇮🇹 (@DailyNews79) May 23, 2022
BAN vs SL: Kusal Mendis taken to hospital with chest pains pic.twitter.com/cBt6ijSNyM
— sports news (@CricketDeDaNaDa) May 23, 2022
Kusal Mendis taken to hospital with chest pains
More ➡️ https://t.co/32RizbYqMR#BANvSL #KusalMendis #SriLanka pic.twitter.com/UC2zTDUQ95
— CricTelegraph (@CricTelegraph) May 23, 2022
