డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినా భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత జట్టులో ఎంతో మంది యువ ప్రతిభావంతులు ఉన్నారని.. వారికి ఛాన్స్‌లు ఇస్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాడు.
ఒకే ఒక్క ఓటమి.. భారత క్రికెట్ జట్టులో పెద్ద అలజడి సృష్టిస్తోంది. ప్లేయర్ల దగ్గర నుంచి టీమ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లు, బీసీసీఐ వరకు అందర్నీ విమర్శలపాలు చేస్తోంది. అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమి. మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కానీ టెస్టుల్లో వరల్డ్ కప్‌గా భావించే డబ్ల్యూటీసీ ట్రోఫీని రెండోమారు చేజార్చుకోవడంతో భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా నేరుగా వచ్చి ఆసీస్‌తో ఫైనల్ ఫైట్‌కు దిగడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ పైనా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ ఫెయిల్ అవుతున్న రోహిత్‌ను నాయకత్వ పగ్గాల నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పిన తర్వాత సరైన ఆప్షన్‌గా రోహిత్ కనిపించాడని గంగూలీ చెప్పాడు. హిట్‌మ్యాన్ ఈ ఓటమిని మర్చిపోయి.. వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో మరింత దూకుడుగా కెప్టెన్సీ చేయాలని సూచించాడు. టెస్టుల విషయంలో ఆందోళన చెందొద్దని.. టాలెంటెడ్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారన్నాడు దాదా. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని గంగూలీ సూచించాడు. పాండ్యా సుదీర్ఘ ఫార్మాట్లో ఆడితే చూడాలని ఉందన్నాడు. ఇంగ్లండ్ లాంటి ఓవర్సీస్ కండీషన్స్‌లో అతడు టీమ్‌లో ఉంటే అదనపు బలంగా మారుతుందని గంగూలీ పేర్కొన్నాడు. తన మాట పాండ్యా వింటాడని భావిస్తున్నానని తెలిపాడు. పాండ్యాతో పాటు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్రతిభ కలిగిన ప్లేయర్స్ టీమిండియాలో ఉన్నారని దాదా వ్యాఖ్యానించాడు.
Sourav Ganguly wants Hardik Pandya to play test cricket | Sports Today#souravganguly #cricket #hardikpandya #testcricket #WTCFinal #WTCFinal #reelsviral #bcci #viratkohli #rohitsharma #indiancricketteam #TeamIndia #SportsTak #SportsToday @hardikpandya7 @SGanguly99 pic.twitter.com/jXoyQan3Ic
— Sports Today (@SportsTodayofc) June 13, 2023