బీసీసీఐ అధ్యక్షుడు.. దాదా సౌరవ్ గంగూలీ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తదుపరి ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖరారు అయిపోనట్లు తెలుస్తోంది. ఆ పదవికోసం తీవ్రమైన పోటీ ఉన్నా కూడా గంగూలీకి పదవి దక్కడం లాంఛనమే అంటూ చెబుతున్నారు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ మ్యాగజీన్ స్పోర్ట్స్ స్టార్ ఈ విషయంపై విశ్లేషించింది.
ఐసీసీ ఛైర్మన్ రేసులో ప్రముఖంగా బీసీసీఐ కార్యదర్శి జైషా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్లు వినిపించినా.. అవి పుకార్లేనని కొట్టిపారేశారు. గంగూలీ ఎంపికపై కూడా బీసీసీఐ అధికారిని ప్రశ్నించగా.. అందుకు చాలా సమయం ఉందంటూ స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా సమయం ఉండగా.. ఇప్పటి నుంచే చర్చలు ఎందకని ప్రశ్నించారు.
న్యూజిలాండ్ కు చెందిన ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే పదవీ కాలం ఈ ఏడాది నవంబరుతో ముగియనుండగా.. కొత్త ఛైర్మన్ ఎవరనేదానిపై ఇప్పటి నుంచే చర్చలు, ఉహాగానాలు మొదలయ్యాయి. గతంలో భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, సీఎస్కే అధినేత శ్రీనివాసన్, సీనియర్ అడ్వకేట్ శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్ గా చేశారు. సౌరవ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్ గా ఎంపిక అవుతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sourav Ganguly could be the next chairman of the ICC. (Reported by Sportstar).
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2022