‘ఐపీఎల్ 2021 సెకెండాఫ్’లో అన్ని ఫ్రాంచైజీలు అనూహ్యంగా ప్రదర్శన చేస్తున్నాయి. ముందుంటాయనుకున్న జట్లు టేబుల్‌లో చివరికి చేరాయి. ఆటగాళ్లు కూడా ఎక్కువ అంచనాలతో మ్యాచ్‌లోకి వస్తున్న ప్లేయర్ నిరుత్సాహ పరుస్తున్నారు. ఇప్పటి సంగతి పక్కన పెడితే ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌పైనే అందరి దృష్టి ఉంది. వివిధ జట్లలో ఉన్నా.. టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రదర్శన ఎంతో ముఖ్యం. వారిలో కొందరు బాగానే ఆడుతున్నా.. కొందరి పరిస్థితి మాత్రం ఏం అర్థం కావడం లేదు. అందరి చూపు పాండ్యాపైనే ఉంది. సెంకండాఫ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు హార్దిక్ పాండ్యా. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వారి ఫామ్‌పై అందరూ అనుమానం, ఆందోళనగా ఉన్నారు.
పాండ్యా ఔట్.. శార్దూల్ ఇన్?
హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ముఖ్యంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అస్సులు ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాకప్ ప్లేయర్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు దీపక్ చాహర్ లేదా ఇషాన్ కిషన్ స్థానంలో 15 మంది సభ్యుల్లో అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరి ఫామ్ ఆందోళనకరంగా ఉన్నా.. వారు తప్పకుండా తిరిగి ఫామ్‌ను అందుకుంటారని బీసీసీఐ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కోహ్లీ కూడా ఫామ్‌లో లేడు అనుకున్నారు. వెంటనే వరుస అర్ధ శతకాలు చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. జట్టులో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ అక్టోబర్ 10 వరకు అవకాశం ఇచ్చింది. ఈలోగా చాలా మార్పులు జరగచ్చని భావిస్తున్నారు. ఈలోగా బీసీసీఐ మరోసారి తుది జట్టును ప్రకటించవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ భారత బృందం
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జాస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
బ్యాకప్ ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.